HAPPY NEW YEAR  2024 న్యూ ఇయర్లో ఇలా చేయండి.. ఖచ్చితంగా మీ సంతకం ఆటోగ్రాఫ్ అవడం ఖాయం

HAPPY NEW YEAR  2023 న్యూ ఇయర్ వస్తోంది అంటే ..ఓ వైపు ఉత్సాహం .. మరోవైపు ఏదో సాధించాలనే తపన. గతేడాది అనుకున్నవి ఏమీ జరగలేదన్న నిరాశ. మరి.. కొత్త ఏడాదిలోనైనా మన పనులు సక్రమంగా జరగాలంటే ఇలా చేస్తే విజయం మీ వెంటే.

HAPPY NEW YEAR  2024 న్యూ ఇయర్లో ఇలా చేయండి.. ఖచ్చితంగా మీ సంతకం ఆటోగ్రాఫ్ అవడం ఖాయం
New Update

న్యూ ఇయర్ సందడి మొదలయింది. 2023 సవంత్సరానికి వీడ్కోలు పలుకుతూ .. 2024 కు వెల్కమ్ చెప్పేందుకు సమయం ఆసన్నమయింది. ఇక ..యూత్ అంతా ఇప్పటినుంచే ఇయర్ ఎండ్ పార్టీ ప్లాన్స్ లో మునిగితేలుతున్నారు. కొంతమంది ఈ కొత్త ఏడాదైనా జీవితాలు మారతాయని ప్రణాళికలు రచిస్తుంటారు. .కానీ .. ఎంత వరకు ఆ ప్లాన్స్ వర్కౌట్ చేస్తున్నారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. మరి.. మనం వేసుకున్న ప్రణాళికలు వర్కౌట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి. ఎలాంటి పథకం రచించాలి.డసెంబర్ 31.ఈ డేట్ దగ్గరపడుతోంది అంటే . .ఉత్సాహం ఓ వైపు , మరో వైపు మైండ్ అంతా ఒక కన్ఫ్యూజన్ . ఏడాది గడిచింది.. అనుకున్న పని ఒక్కటి కూడా జరగలేదు. టైం బాగాలేదు. టైం కలిసిరాలేదు. ఇది సగటు మనిషి అంతరంగం. కానీ ఎందుకు మన ప్లాన్స్ వర్కౌట్ అవడం లేదో ఒక్కసారయినా ఆత్మ విమర్శ చేసుకున్నారా ?

రాత్రంతా స్నేహితులతో పార్టీలు.. తెల్లారే శ్రీరంగ నీతులు

మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం భవిష్యత్ గురించి ఒకానొక సందర్భంలో చాలా చక్కగా వివరించారు.
మీరు మీ భవిష్యత్తును మార్చలేరు. కానీ, మీ అలవాట్లను మార్చుకోగలరు.కాబట్టి.. మీ అలవాట్లు..మీ భవిష్యత్తును మారుస్తాయి.అద్భుతమైన ఈ మాటలకు భవిష్యత్ మార్చే శక్తి ఉంది. మరి.. మనలో ఏంతమంది హ్యాబిట్స్ విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాత్రంతా స్నేహితులతో పార్టీల్లో గడిపి తెల్లారే శ్రీరంగ నీతులు చెబితే భవిష్యత్ మారుతుందా ? ఇది ఎప్పటికి జరగదు. మరికొంతమంది చాలా సిన్సియర్ గా డిసెంబర్ 31 న డిసైడ్ అయిపోతారు. బ్యాడ్ హ్యాబిట్స్ మానేసి టార్గెట్ వైపు అడుగులు వేద్దామని. నెల తిరిగేసరికి కమిట్మెంట్ ఫెయిల్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు కూడా అనుకున్నది సాధించలేరు.

న్యూ ఇయర్ లో ఇలా చేయండి

నిజంగా మీలో ఏదయినా సాధించాలనే దృఢసంకల్పం ఉంటె .. మీరు చేయవలసిందల్లా ఒక్కటే. ప్రతీ రోజూ దినచర్యను పక్కాగా ప్లాన్ చేసుకోండి. జీవితంలో ఒక్క రోజుని కూడా సక్రమంగా ప్లాన్ చేసుకోలేని వాళ్ళు భవిష్యత్ అంతా ఎలా ప్లాన్ చేస్తారు.మంచి గోల్స్ ఉన్నవాళ్ల పరిచయాలను పెంచుకోండి. చెడు స్నేహాలను వదిలిపెట్టేయండి. కష్టాలు లేని మనిషి ఈ భూప్రపంచంలో ఉండరు. కష్టాలు నిన్ను ఎటాక్ చేస్తున్నప్పుడే .నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి వాటికి నీ పవర్ ఏంటో చూపించాలి. జీవితంలో సక్సస్ అయిన వాళ్ళను ఒక్కసారి గమనించండి. వాళ్ళ డైరీ లో ప్రతీ సెకెనుకు చాలా విలువ ఉంటుంది. కాలానికి విలువ ఇవ్వండి. ఒక్క క్షణమైనా వెనక్కి వెళితే తిరిగిరాదనే విషయం ప్రతీ క్షణం గుర్తుపెట్టుకోండి. నిజాయితీ గా కష్టపడండి. టైంపాస్ చేస్తే నిజంగా టైం పాస్ వ్యవహారమే అవుతుంది.ఇలా ఓ ఆరు నెలలు చేయండి .. మీ జీవితంలో కొంతమార్పు రావడం ఖాయం. ఇలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే వచ్చే డిసెంబర్ నాటికి మీరు ఖచ్చితంగా సాధిస్తారు. మనం ఎంచుకున్నది ఏ రంగం అయినా కావచ్చు సరైన ప్రణాళిక , క్రమశిక్షణ , అంకితభావం , టైమ్ మేనేజ్మెంట్ పక్కాగా ఉంటె విజయం తప్పకుండా వరిస్తుంది. చివరిగా అబ్దుల్ కలాం విలువైన మాటలను స్మరించుకుందాం. సక్సెస్ అంటే..మీ సంతకం ఆటోగ్రాఫ్‌గా మారడమే!. దీనికోసం ప్రయత్నించండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అల్ ద బెస్ట్.

ALSO READ :SHABARIMALA: శబరిమల అయ్యప్ప సన్నిదిలొ ఈ వాక్యాన్ని గమనించారా ?

#happy-new-year-2024 #new-year-events #new-year-goals
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe