తగ్గేదేలే అంటోన్న ఎన్డీఏ..ప్రతిపక్షాలకు ధీటుగా 38పార్టీలతో సమావేశం..!!

దేశంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. రానున్న లోకసభ ఎన్నికలను ద్రుష్టిలో ఉంచుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ప్రతిపక్షపార్టీలన్నీ ఏకమయ్యాయి. అటు ఎన్డీఏ కూడా తన మిత్రపక్షాలతో సమావేశం అవుతోంది. ఈ రెండు కూటమలు కూడా నేడు సమావేశం కానున్నాయి. ప్రతిపక్షాలు కర్నాటక రాజధాని బెంగళూరులో సమావేశం అయితు..ఎన్డీఏ 38పార్టీలతో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం అవుతోంది.

తగ్గేదేలే అంటోన్న ఎన్డీఏ..ప్రతిపక్షాలకు ధీటుగా 38పార్టీలతో సమావేశం..!!
New Update

లోకసభ ఎన్నికలు దృష్ట్యా ప్రధాన పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల పోరులో కలిసి వచ్చేందుకు ప్రతిపక్షాలు మహాకూటమి ఏర్పాటులో నిమగ్నమై ఉంది. ఎన్డీఏ కూడా తన మిత్రపక్షాలతో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు ఎన్డీఏ కూటమి సమావేశం కానుంది. ఈ భేటీలో 38పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. కొన్నిరోజుల్లో రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలు, ఎన్డీఏ కూటమి రెండూ కూడా సన్నద్ధం అవుతున్నాయి.

publive-image

కాగా నేడు ప్రతిపక్షాల మీటింగ్ కర్ణాటక రాజధాని బెంగళూరులో సమావేశం కాగా, ఢిల్లీలో 'ఎన్డీయే' కూటామి సమావేశం జరగనుంది. దీని కోసం అటు విపక్ష పార్టీల్లోనూ, ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే శిబిరంలోనూ కలకలం మొదలైంది. విశేషమేమిటంటే ఓపీ రాజ్‌భర్‌కు చెందిన సుభాష్ప కూడా ఎన్డీయే శిబిరంలోకి చేరారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒకదాని తర్వాత ఒకటి విజయం సాధించడం ద్వారా దేశంలో భారతీయ జనతా పార్టీ పట్టు బలపడింది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.

రానున్న లోక్‌సభ ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్నందున, అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు... తమ రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలన్నీ ప్రారంభించాయి. 26 ప్రతిపక్ష పార్టీలు సోమవారం, మంగళవారాల్లో (జూలై 17-18) బెంగళూరులో తమ సమావేశమై బీజేపీని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చించనున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) కూడా ఢిల్లీలో దాదాపు 30 పార్టీలు కూటమితో సమావేశం కానుంది. ఎన్జీఏ అభివృద్ధి ఎజెండా, పథకాలు, విధానాలు, పీఎం మోడీ నాయకత్వంలో నడుస్తున్న వాటిపై ఆసక్తి చూపాయని అందుకే ఎన్డీఏ వైపు పార్టీలు ఉత్సాహంతో వస్తున్నాయని జేపీ నడ్డా తెలిపారు.

బీజేపీని టార్గెట్ చేస్తూ విపక్షాలన్నీ ఏకతాటిపైకి:
రాజకీయంగా, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవలి కాలంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సార్వత్రిక ఎన్నికల విజయాలు కేంద్రంలో కాషాయ పార్టీ పట్టును బలోపేతం చేయడమే కాకుండా, ఆటుపోట్లను మార్చే ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీలను భిన్నంగా ఆలోచించేలా చేసింది.

బీజేపీ సహా పెద్ద పార్టీలు ఎన్నికలకు సిద్ధం:
ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేసింది. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో బీజేపీ కొత్త అధ్యక్షులను నియమించింది. అదే సమయంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఈ విధంగా ఎన్నికలకు బీజేపీ ఇప్పటినుంచే సమాయత్తం అవుతోంది. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు చిరాగ్ పాశ్వాన్‌తో సహా అనేక కొత్త మిత్రపక్షాలు, కొన్ని మాజీ మిత్రపక్షాలు జూలై 18న బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సమావేశానికి పాలక కూటమి బలాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షత వహించనున్నారు.

ఎన్డీయే సమావేశానికి ఈ పార్టీలు హాజరయ్యే అవకాశం ఉంది:

1. భారతీయ జనతా పార్టీ (బిజెపి)
2. శివసేన షిండే గువా (SHS)
3. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP-అజిత్ పవార్)
4. అప్నా దల్ (సోనేలాల్)
5. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI)
6. జనసేన పార్టీ (JSP)
7. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)
8. హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM)
9. నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP)
10. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)
11. జననాయక్ జనతా పార్టీ (JJP)
12. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK)
13. పట్టాలి మక్కల్ కట్చి (PMK)
14. సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM)
15. ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU)
16. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP)
17. తమిళ్ మనీలా కాంగ్రెస్ (TMC)
18. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)
19. అస్సాం గణ పరిషత్ (AGP)
20. యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (UPPL)
21. శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్)
22. ఆల్ ఇండియా NR కాంగ్రెస్ (AINRC)
23. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP)
24. మన ఆమ్ దళ్ (నిషాద్), బలహీన భారతీయుడు దోపిడీకి గురయ్యాడు
25. ఇండియన్ మక్కల్ కల్వి మున్నేట్ర కజగం (IMKMK)
26. రాష్ట్రీయ లోక్ జనతా దళ్ (RLJD)
27. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT)
28. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF)
29. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (MGP)
30. నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF)

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe