కర్ణాటకలో పులిగోరు పంచాయితీ.. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు
ఇటీవల పులిగోరు ధరించారనే కారణంతో బిగ్‌బాస్‌లో ఉన్న వర్తుర్ సంతోష్‌ను అరెస్టు చేయడంతో కర్ణాటకలో పులిగోరు అంశం దుమారం రేపుతోంది. పులిగోర్లు ధరించిన కొంతమంది ప్రముఖులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీళ్లపై చర్యలు తీసుకోవాలంటూ నెటీజన్లు సైతం తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.