ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు.. 28 ఏళ్లకు ఆ జాబ్ వచ్చింది..
ఉత్తరప్రదేశ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తికి 28 ఏళ్ల తర్వాత ఆ ఉద్యోగం వచ్చింది. అంకుర్ గుప్తా అనే వ్యక్తి 1995లో తపాలాశాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. అతను మెరిట్ జాబితాలో చోటు సంపాదించుకుని ముందస్తు శిక్షణకు కూడా ఎంపికయ్యాడు. కానీ అతని విద్యార్హతల కారణంగా ఉద్యోగానికి అనర్హుడంటూ తపాలాశాఖ అంకుర్‌ను ఎంపికైన అభ్యర్థుల జాబితా నుంచి తొలగించింది. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు రావడంతో దీనిపై తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం అతనికి నెలరోజుల్లో ఉద్యోగాన్ని ఇవ్వాలని తపాలాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.