మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వస్తున్న ఫలితాలను బట్టి ఏదో తప్పు జరిగినట్లు అనిపిస్తోందని అన్నారు. ఇది ప్రజల నిర్ణయం కాదని.. ఇక్కడ ఏం తప్పు జరిగిందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు. మహాయుతి కూటమికి కనీసం 75 సీట్లు కూడా రావడం లేదంటే ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ, అమిత్ షా, గౌతమ్ అదానీ మహారాష్ట్ర ఫలితాలను తప్పుదోవ పట్టించారంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయతి కూటమి మేజిక్ ఫిగర్‌ను దాటి 219 స్థానాల్లో అధిక్యంలో దూసుకుపోతోంది. ఇక మహా వికాస్ అఘాడి కేవలం 48 స్థానాలకే పరిమితమైపోయింది.
ఏదో తప్పు జరిగింది.. మహారాష్ట్ర ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో వస్తున్న ఫలితాలను బట్టి ఏదో తప్పు జరిగినట్లు అనిపిస్తోందని అన్నారు. ఇది ప్రజల నిర్ణయం కాదని.. ఇక్కడ ఏం తప్పు జరిగిందో అందరికీ తెలుస్తుందని పేర్కొన్నారు.
New Update
Advertisment