Priyanka : తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సత్తా చాటుతున్నారు. కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు పోటీ చేసిన ప్రియాంక అన్న రాహుల్ గాంధీని బీట్ చేశారు. ప్రస్తుతం ఆమె 3,09,690 ఓట్లతో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
Also Read : బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు గజగజ.. 104 ఆలౌట్!
ఇది కూడా చదవండి: అంధులకు దారి చూపించే AI కళ్లద్దాలు.. చదివిస్తాయి కూడా
రాహుల్ గాంధీని బీట్ చేసి..
ఈ ఉప ఎన్నికకు ప్రియాకంతోపాటు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరి పోటీ చేశారు. అయితే ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ 3.6 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఈ స్థానాన్ని వదులుకున్నారు. అనంతరం ప్రియాంక రంగంలోకి దిగారు. ఇక సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరికి 82,082 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌కు 45,927 ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Eknath Shinde: మహారాష్ట్రలో షిండే సక్సెస్ కు 5 ప్రధాన కారణాలివే!
Also Read: మహారాష్ట్రలో షిండే సక్సెస్ కు 5 ప్రధాన కారణాలివే!