శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నవంబర్ 24న ప్రారంభం కానున్న సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి.
ఇది కూడా చూడండి: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి
జమిలి ఎన్నికలతో పాటు..
ఈ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలతో పాటు వక్ఫ్ బోర్డులో సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది. ముస్లింల మతపరమైన, సామాజక, ఆర్థిక విషయాలను చూసుకోవడానికి వక్ఫ్ బోర్డును 1954లో ఆమెదించారు. ఆ తర్వాత 1995, 2013లో దీన్ని సవరణలు చేశారు. సాధారణంగా ఈ వక్ఫ్ బోర్డు విషయంలో కేంద్రం లేదా రాష్ట్రం ఎలాంటి జోక్యం చేసుకోదు.
ఇది కూడా చూడండి: సుకుమార్ సపోర్ట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే.. పుష్ప2 BGMపై సంచలన నిర్ణయం!
గత కొంత కాలం నుంచి ఈ వక్ఫ్ బోర్డుపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ బోర్డులో కొన్ని సవరణలు ఎన్డీయే ప్రభుత్వం చేయనుంది. ఈ వక్ఫ్ బోర్డుకి కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఎవరి ఆస్తిని అయిన సొంతం చేసుకునే అధికారం కల్పించడం వల్ల.. పలు ప్రాంతాలను అక్రమంగా తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫిర్యాదు ఎక్కువగా వచ్చాయి.
ఇది కూడా చూడండి: AP Crime: ముసలోడికి ఇదేం మాయరోగం..11 ఏళ్ల అమ్మాయిని అలా చేస్తాడా..!
ఇదిలా ఉండగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక దేశమంతా జరగాలని భావిస్తోంది. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ జమిలి ఎన్నికలపై కూడా పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!