హోరాహోరీగా సాగిన మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతీ కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 220కి పైగా సీట్లలో ఆ కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర నెక్ట్స్ సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ముంబైలోని ఫడ్నవీస్ నివాసానికి బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఫడ్నవీస్ కే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరో వైపు షిండే సైతం సీఎం మార్పు ఉండదంటూ కామెంట్ చేశారు. ఎక్కువ సీట్లు వచ్చిన వారే సీఎం కావాల్సిన అవసరం లేదన్నారు. మరో వైపు తాను కూడా రేసులో ఉన్నానని అజిత్ పవార్ చెబుతున్నారు. మరో వైపు ఒక్కడే నాయకుడు ఉండాలంటూ షడ్నవీస్ ట్వీట్ చేశారు. అజిత్ పవార్ కూడా సీఎం కాగలడని ఆయన సతీమణి సునేత్ర పవార్ వ్యాఖ్యానించారు. దీంతో సీఎం అభ్యర్థి కోసం కూటమి నేతల మధ్య పోరు ఖాయమన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం!
ఇది కూడా చదవండి: Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం..