Maha Vikas Aghadi: మహా వికాస్ అఘాడి చేసిన ఈ తప్పులే ఓటమికి కారణం..

మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడిని మారాఠి ప్రజలు తిరస్కరించారు మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. అయితే మహా వికాస్ అఘాడి కూటమి చేసిన కొన్ని పొరపాట్ల వల్లే ఇలా ఘోర పరాజయం పొందిందనే చర్చ నడుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

ii
New Update

మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడికి మారాఠి ప్రజలు తిరస్కరించారు. ప్రస్తుతం మహాయుతి కూటమి 220 స్థానాల్లో దూసుకుపోతుంది. మహా వికాస్ అఘాడి మాత్రం 57 స్థానాల్లోనే అధిక్యంలో కొనసాగుతోంది. మొత్తానికి ఇక్కడ మహాయుతి కూటమి గెలుపు ఖరారైపోయింది. అయితే మహా వికాస్ అఘాడి కూటమి చేసిన కొన్ని పొరపాట్ల వల్లే ఇలా ఘోర పరాజయం పొందిందనే చర్చ నడుస్తోంది. 

ఇది కూడా చదవండి: Eknath Shinde: మహారాష్ట్రలో షిండే సక్సెస్ కు 5 ప్రధాన కారణాలివే!

Maharashtra Elections 2024

2022లో అధికారంలో ఉన్న శివసేన పార్టీ రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబాటు కారణంగా శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే సీఎం పదవి కోల్పోయాడు. చివరికి షిండే సీఎం అయ్యాడు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి కూటమికి సానుభూతి వచ్చింది. ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే, శరద్‌ పవార్‌.. షిండే, అజిత్‌ పవార్‌ పార్టీల కంటే అత్యధిక సీట్లు సాధించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఎంవీఏ ఈ సానుభూతినే నమ్ముకుంది. కానీ ఇది ఫలించలేదు. 

Also Read: మహారాష్ట్రలో షిండే సక్సెస్ కు 5 ప్రధాన కారణాలివే!

మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీట్ల పంపకం నుంచి సీఎం పదవి వరకు మహా వికాస్ అఘాడి కూటమిలో విభేధాలు జరుగుతూనే వచ్చాయి. ఓవైపు మహాయుతి కూటమి ఎన్నికలకు కసరత్తులు చేస్తుంటే.. ఎంవీఎస్‌ నాయకులు సీఎం పదవిపై చర్చలు పెట్టారు. మొదట్లో ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవికి మొగ్గు చూపారు. కానీ ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. చివరికీ సీఎం ఎవరు అనే దానిపై ఎంవీఎస్ ఎలాంటి ప్రకటన చేయకూడదని నాయకులు ఓ అంగీకారానికి వచ్చారు. దీంతో ఇది ప్రజల్లో మహా వికాస్ అఘాడి నుంచి నాయకుడు ఎవరూ అనే అంశం ప్రజల్లో సందేహాలను నెలకొల్పింది.  

ఇది కూడా చదవండి: Aus Vs Ind: బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు గజగజ.. 104 ఆలౌట్!

ముఖ్యంగా మహిళా ఓటర్ల కోసం ప్రభుత్వ పథకాలను అమలు చేయలేకపోవడం, సరైన వ్యూహాలు రచించకుండా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లడం, మహాయుతి కూటమిని రాజకీయంగా సరిగ్గా ఎదుర్కోకపోవడం లాంటి అంశాలు ఎంవీఎస్‌ ఓటమికి కారణమయ్యాయి. చివరికి రాహుల్ గాంధీ వ్యాపారవేత్త గౌతమ్‌ అధానికి ధారవిని అప్పగించబోతున్నారంటూ ప్రచారం చేసినప్పటికీ అది ఫలించలేదు. అలాగే బీజేపీ హిందుత్వ ఎజెండాను కూడా ఎదుర్కోవడంలో ఎంవీఏ ఫెయిల్ అయ్యింది. మహాయుతి వైపు ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లాంటి బలమైన నాయకులు తమ నాయకత్వ అధిపత్యాన్ని చూపించుకోగలిగారు. కానీ ఎంవీఎస్‌లో ఉద్ధవ్ ఠాక్రే, శరద్‌ పవార్‌లు తమ నాయకత్వాన్ని ప్రదర్శించడంలో విఫలమయ్యారు.  

Also read: మహారాష్ట్రలో సీఎం పోరు.. షిండే VS ఫడ్నవీస్

#national-news #maharashtra election #maha-vikas-aghadi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe