మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటకలోని మూడు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు స్థానాల్లో బీజేపీ ఓడిపోగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో చన్నపట్నం నియోజకవర్గం జేడీఎస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేశారు.
ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?
విజయం పక్కా అని భావించిన..
ఇక్కడి నుంచి విజయం తథ్యమని అందరూ భావించారు. కానీ ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి సీపీ యోగేశ్వర చేతిలో ఓటమి చవిచూశారు. నిఖిల్ కుమారస్వామి ఇప్పటికీ మూడు సార్లు ఓడిపోయారు. మొదటి సారి 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నటి సుమలత నిఖిల్ మీద విజయం సాధించింది. ఆ తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇది కూడా చూడండి: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?
గతంలో రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి మద్దతు లభించడంతో ఈసారి విజయం తథ్యమని భావించారు. కానీ ఆశలన్నీ నిరాశలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సీపీ యోగేశ్వర చేతిలో నిఖిల్ 25,413 ఓట్లతో ఓడిపోయాడు.
ఇది కూడా చూడండి: హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!
ఈ ఎన్నికల్లో నిఖిల్ కుమారస్వామికి 87,229 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి యోగేశ్వరాకు 1,12,642 ఓట్లు వచ్చాయి. నటుడి నుంచి రాజకీయవేత్తగా మారిన సీపీ యోగేశ్వర బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. యడ్యూరప్ప ప్రభుత్వం సమయంలో అటవీ శాఖ మంత్రిగా కూడా సీపీ యోగేశ్వర పనిచేశారు.
ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!