మనిషే కామ్..పని మాత్రం స్ట్రాంగ్...మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం శిండే?

రెండున్నరేళ్ళ పనితనం కనిపించింది. మౌనంగానే ఎదగమని...అంటూ ఎక్కువ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయిన ఏక్‌నాథ్‌శిండే కు ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. అందుకే భారీ మెజార్టీతో గెలచిన ఈయనే మళ్ళీ మహారాష్ట్ర సీఎం అవుతారని అంటున్నారు.

MH
New Update

బస్సు కండక్టర్ సూపర్ హీరో అవడం, ఆటో డ్రైవర్ సీఎం అవడం...ఇలాంటివి మన భారతదేశంలోనే జరుగుతాయి. అది కూడా మహారాష్ట్రకే సొంతం. డైలాగ్‌లు చెప్పి ఒకరు సూపర్ హీరో అయితే...చాలా తక్కువ మాట్లాడుతూ మరొకరు అయ్యారు. నామ్ నహీ కామ్ దికనీ చాహియే అన్న నానుడికి పర్‌‌ఫెక్ట్ ఉదాహరణ ఈయన. ఒక మౌనముని మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆయనే ఏకనాథ్‌ శిండే.

మౌనముని...

మన పని ఎవరు చూస్తారు...మనం ఏం మాట్లాడుతున్నామో అదే ముఖ్యం అన్నట్టు తయారయ్యిందీ ప్రపంచం.  అందులోనూ ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాలు అంటే..అన్నింటికంటే ముందు బాగా మాట్లాడ్డం రావాలి.  అవతలి వారి మీద అవసరం ఉన్నా లేకపోయినా విమర్శలు గుప్పించగలిగే చాతుర్యం ఉండాలి. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే సమాధానం చెప్పగలగాలి. అప్పుడే పెద్ద నేత అవుతారు అన్నట్టు ఉంది వరుస. అయితే ఇదంతా ఉట్టిదే అసలేం మాట్లాడకపోయినా పర్వాలేదు పని చేస్తే చాలు అని నిరూపించారు ఏక్‌నాథ్‌ శిండే. మహారాష్ట్ర రాజకీయాల్లో ఈయన ఒక సంచలనం.  ఒక ఆటో డ్రైవర్ రాజకీయాల్లోకి రావడమే కాదు సక్సెస్ కొట్టి కూడా చూపించారు. శివసేన పార్టీలో చేరి చాలా తొందరగానే ఎదిగారు శిండే. అది కూడా ఆ పార్టీకి గుండెకాయలాంటి ఠాణే జిల్లాలో. 2022లో  పార్టీ అగ్రనేత ఉద్దవ్‌ఠాక్రేపై 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేసి బీజేపీ సాయంతో సీఎంగా పగ్గాలు చేపట్టారు. 

అవసరమైతే నిప్పులే..

శిండే ఎక్కువ మాట్లాడరని అందరికీ తెలిసిన వియమే కానీ.. అవసరమయితే ప్రసంగాల్లో నిప్పులు కురిపించగలరు. శివసేన వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన శివసేన (యూబీటీ) అగ్రనేత ఉద్ధవ్‌ఠాక్రేపై నిప్పులు చెరిగిన విధానం చూస్తే ఈ విషయం ఎరికైనా బోధపడుతుంది. అంటే మాట్లాడ్డం రాక శిండే మౌనంగా ఉండరు. మాటల కన్నా తన పనితోన సమాధానం చెప్పాలనుకుంటారు. సీఎం అయ్యాక ఆ పదవిలో ఎక్కువ కాలం ఉండలేరు అన్నారు. మళ్​ళీ ఉద్దవ్‌ఠాక్కే వచ్చస్తారు అని విమర్శించారు. అయితే రెండున్నరేళ్ల పదవీ కాలంలో మహారాజకీయాల్లో శిఖరనేతగా ఎదిగాడు.  పలు పథకాలు ప్రవేశపెట్టాడు.

Also Read: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

బాలఠాక్రే ఏకలవ్య శిష్యుడు... 

ఏక్‌నాథ్‌ శిండే బాలఠాక్రే శిష్యుడు. డైరెక్ట్‌గా ఆయనతో కలిసి పని చేయకపోయినా...ఠాక్రేను ఆదర్శంగా తీసుకుని ఎన్నో విషాలను నేర్చుకున్నారు. శివసేన పునాదులైన మరాఠా ప్రయోజనాలు కాపాడటం, హిందూ రక్షణ అంశాలపై పార్టీ అలుపెరుగని పోరాటం చేసింది. వీటిని నిలబెట్టడం కోసమే శిండే పార్టీని చీల్చారు. బీజేపీతో జత కట్టారు అని చెబుతారు. కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో ఉద్ధవ్‌ జట్టు కట్టడం...బాలఠాక్రే అశయాలకు విరుద్ధమని బలంగా నమ్మారు శిండే. 

Also Read: Priyanka Gandhi: అన్న మెజార్టీని దాటిన ప్రియాంక.. వయనాడ్‌లో సంచలనం!

నిలబెట్టిన పథకాలు...

రెండున్నరేళ్ళ సీఎం పదవీ కాలంలో ఏక్‌నాథ్‌ శిండే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. ఇవి మరాఠీలను ఎంతగానో ఆట్టుకున్నాయి. లడ్కీ బహిన్‌ యోజనతో అర్హులైన మహిళలకు నెలనెలా రూ1500 సాయం..లడ్కా బౌ యోజనతో నిరుద్యోగ యువకులకు శిక్షణ..ముంబయి నగరంలో ప్రవేశించే ఐదు టోల్‌గేట్స్‌ నుంచి కార్లు ..తదితర వాహనాలపై టోల్‌రద్దు లాంట పథకాలు శిండేకు మంచి పేరు తెచ్చి పెట్టయి. దాంతో పాటూ మరాఠా రిజర్వేషన్ల అంశం ఆ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. 2014 తరువాత శిండే మాత్రమే మరాఠా వర్గాలకు చెందిన సీఎం. దీంతో  పాటు మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించడం వారికి ఎంతో నచ్చింది. రిజర్వేషన్లతో పాటు మరాఠా వర్గానికి చెందిన శిండే సీఎంగా ఉండటంతో మెజార్జీ మరాఠా ఓటర్లు మహాయుతికే ఓటు వేశారు. అందుకే ఈసారి మళ్ళీ సీఎం అయ్యేది ఏక్‌నాథ్‌ శిండేనే అంటున్నారు. ఆయన అయితేనే మహారాష్ట్ర ప్రజలకు న్చుతుందని భావిస్తున్నారు. 

Also Read: మనిషే కామ్..పని మాత్రం స్ట్రాంగ్...మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం శిండే?

 ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

 

 

 

#eknath-shinde #maharashtra-elections #mahayuti #Maharashtra cm
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe