MP : మధ్యప్రదేశ్ లో ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి అనవసరంగా రూ. 295 కట్ చేసినందుకు బ్యాంకు పై ఏడేళ్లు న్యాయపోరాటం చేసి విజయాన్ని అందుకున్నాడు. జబల్ పూర్ జిల్లాలోని పనాగర్ కు చెందిన నిశాత్ తామ్రకార్ 2017 లోవాషింగ్ మెషిన్ ని ఈఎంఐ విధానంలో కొనుగోలు చేశారు.
Also Read: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు!
ఎక్స్‌ట్రా రూ.295 కట్..
ఎస్‌బీఐ ఖాతాలో మొదటి నెల ఈఎంఐతో పాటుగా ఎక్స్‌ట్రా రూ.295 కట్ అయ్యాయి. బ్యాంకును సంపరదిస్తే ..చెక్ డిడక్షన్ ఛార్జీ అని చెప్పారు. ఖాతాలో తగినంత మొత్తాన్ని ఎప్పుడూ ఉంచుతానని, చెక్ బౌన్స్ కావడానికి అవకాశం లేదని నిశాంత్ తెలిపారు.
Also Read: TG: ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి: సీఎం రేవంత్ సవాల్
తన డబ్బు రూ. 295 వెనక్కు ఇవ్వాలని కోరగా..బ్యాంకు సిబ్బంది ససేమిరా అన్నారు. న్యాయవాదిని సంప్రదించిన నిశాంత్ నిబంధనల ప్రకారం రూ. 3 వేలు డిపాజిట్ చేసి, జబల్‌పూర్ వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు.
Also Read: Ukraine: ఇంక చేయలేము..చేతులెత్తేస్తున్న ఉక్రెయిన్ సైనికులు
2017 నుంచి ఈ కేసు విచారణ కొనసాగగా..ఏడేళ్ల తర్వాత నవంబర్ 29న నిశాంత్ కు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. వినియోగదారుడికి రూ. 295 తో పాటు రూ.4,000 పరిహారంగా చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. డబ్బు కోసం ఇదంతా చేయలేదని, వినియోగదారుగా తన హక్కుల రక్షణ కోసమే ఈ పోరాటం చేసినట్లు నిశాంత్ చెప్పుకొచ్చారు.