Video: ఏం క్యాచ్‌రా..నాయనా...తన క్యాచ్‌తో పాక్‌ని భయపెట్టిన కుర్రాడు

శ్రీలంక వేదికగా ప్రేమ్ దాస్ స్టేడియంలో భారత్-A, పాక్‌-A జట్ల మధ్య జరిగిన మ్యాచులో కనీవినీ అద్బుతం జరిగి, మొత్తానికి వండర్ క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. పాక్ జట్టుకి షాకిస్తూ భారత్ ప్లేయర్ పట్టిన ఒక వండర్ క్యాచ్ కాస్త మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ భారత్‌ మొత్తం గిర్రున తిరుగుతోంది.

Video: ఏం క్యాచ్‌రా..నాయనా...తన క్యాచ్‌తో పాక్‌ని భయపెట్టిన కుర్రాడు
New Update

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఒక స్పెషల్‌. ఒక్క సీనియర్ క్రికెట్ జట్టే కాదు, ఉమెన్స్, జూనియర్ టీమ్స్ ఇలా ఎన్ని టీమ్స్‌ తలపడినా సరే ఆ హైప్ అలాగే ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు.. పాకిస్థాన్ జట్టు మీద సీనియర్ క్రికెట్ టీం, ఉమెన్స్ క్రికెట్ టీం ఆధిపత్యం చూపించడం ఇప్పటికీ మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. ఇప్పటివరకు మెన్స్ అయినా, ఉమెన్స్ అయినా దాయాదితో సమరం పూనకం వచ్చినట్లుగా ఆడతారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు భారత్‌ కుర్రాళ్ళు కూడా లెట్స్‌ డూ కుమ్ముడు అంటూ పాకిస్థాన్‌ని ఒణికిస్తున్నారు. ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా భారత్ ఏ-టీం, పాకిస్థాన్-ఏ టీంని ఘోరంగా ఓడించింది. ఇక ఈ మ్యాచులో సాయి సుదర్శన్ సెంచరీ హైలెట్ గా కనిపించినా.. ఒక్క క్యాచ్ తో బౌలర్ హర్షిత్ రానా అందరి దృష్టిని తనవైపు మరల్చుకొని హౌరా అంటూ అబ్బురపరిచాడు.

ఫీల్డింగ్‌లో దుమ్ములేపుతున్న ఇండియన్ కుర్రాళ్లు

క్రికెట్‌ రంగంలో ఒకప్పుడు భారత్ ఫీల్డింగ్ చాలా ఢల్‌గా ఉండేది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టినా ఫీల్డింగ్ లో కాస్త బద్ధకంగా ఉండేవారు. కానీ క్రమక్రమంగా ఇండియన్ క్రికెట్ ఫీల్డింగ్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యువరాజ్, కైఫ్ లాంటి ప్లేయర్స్ ఫీల్డింగ్ కి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తే ప్రస్తుతం కుర్రాళ్ళు ఫీల్డింగ్ లో దుమ్ములేపుతున్నారు. నిన్న హర్షిత్ రానా పట్టిన క్యాచ్ దీనికి నిదర్శనం అనే చెప్పాలి. పాకిస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో క్వసీం అక్రమ్ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ సమయంలో బౌలర్ హంగ్రర్కెర్ వేసిన ఓవర్లో థర్డ్ మ్యాన్ వైపు బంతిని బలంగా కొట్టిన అక్రమ్ హర్షిత్ రానా పట్టిన అద్భుతమైన క్యాచ్ వలన పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. రానా బంతిని ఆందుకునే క్రమంలో గాల్లోకి ఎగరడమే కాదు శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకున్న తీరు అద్భుతం అనే చెప్పాలి.

జాంటీ రోడ్స్‌ని గుర్తుచేసిన హర్షిత్ రానా

ఈ క్యాచ్‌తో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ జాంటీ రోడ్స్ ని గుర్తుచేసాడు హర్షిత్ రానా. గతంలో ఇలాంటి ఎన్నో అసాధ్యమైన క్యాచులని అందుకున్న ఘనత రోడ్స్ ది. రానా పట్టిన ఈ క్యాచ్ చూస్తుంటే ఈ ప్లేయర్ టీమిండియా జాంటీ రోడ్స్ లాగా కనిపిస్తున్నాడు. శ్రీలంక వేదికగా ప్రేమ్ దాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో భారత్-ఏ టీం 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ విధించిన 206 పరుగుల లక్ష్యాన్ని 36.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దూసుకెళ్లింది. ఇటీవలే అద్భుత ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్(104) సెంచరీతో చెలరేగగా.. నీకీ జోస్ (53) అర్ధ సెంచరీతో రాణించాడు. బౌలింగ్ లో హంగ్రర్కెర్ 5 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.

#sachin-tendulkar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe