Namitha: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2026 జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హీరోయిన్ నమిత బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించింది. తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుందని.. అందుకే రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.
అయితే, నమిత విజయ్ పై పోటీ చేస్తున్నట్లు తెలుపడంతో దళపతి విజయ్ అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. విజయ్‌పై పోటీ చేస్తే నమితకు డిపాజిట్ కూడా రాదని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ నమిత గెలుపొందే అవకాశాలు లేకపోలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం నమిత బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా..దళపతి విజయ్ రిసెంట్ గా పొలిటకల్ ఎంట్రీ ఇచ్చారు. ‘తమిళక వెట్రి కజగం’ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్టార్ హీరో విజయ్ ప్రకటించారు. జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. అసెంబ్లీ ఎన్నికల నాటికి వాటన్నింటిని పూర్తి చేసుకొని పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.