Naga Babu : న్యూటన్‌ నియమాలతో చంద్రబాబుకు ఇచ్చిపడేసిన నాగబాబు!

ఓ వైపు టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతుండగా.. మరోవైపు సోషల్‌ మీడియాలో మెగా బ్రదర్‌ నాగబాబు చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. చర్యకి, ప్రతి చర్య ఉంటుందని నాగబాబు పోస్ట్‌ చేశారు. న్యూటన్స్‌ లాస్‌ అంటూ వరుసగా నాగబాబు పోస్టులు పెట్టారు.

Naga Babu : న్యూటన్‌ నియమాలతో చంద్రబాబుకు ఇచ్చిపడేసిన నాగబాబు!
New Update

Naga Babu vs TDP : జనసేన-టీడీపీ(Janasena-TDP) పొత్తులో లుకలుకలు మొదలైనట్టే కనిపిస్తోంది. చంద్రబాబు(Chandrababu) రెండు సీట్లు ప్రకటిస్తే తాను కూడా రెండు ప్రకటిస్తానంటూ ఏకంగా ప్రకటించిపడేశారు పవన్‌(Pawan Kalyan). రాజోలు(Razole), రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని డిక్లేర్ చేయడంతో టీడీపీ గుండెల్లో బాంబు పేలింది. పవన్‌ ఎక్కడా తగ్గేదేలా అని దూసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. పొత్తులో ఎవరూ అప్పర్‌ హ్యాండ్‌ కాదని పవన్‌ చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

పొత్తు ధర్మం పాటించాలంటూ చంద్రబాబుపై నేరుగా వ్యాఖ్యలు చేశారు పవన్‌. ఇదే సమయంలో నాగబాబు(Naga Babu) చేసిన ట్వీట్లు ఆసక్తిని రేపుతున్నాయి.

Also Read : బీహార్‌లో కీలక మలుపు.. నితీశ్ సర్కార్ సంచలన నిర్ణయం

న్యూటన్‌తో చురకలు:
ఓ వైపు టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతుండగా.. మరోవైపు సోషల్‌ మీడియా(Social Media) లో మెగా బ్రదర్‌ నాగబాబు చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. చర్యకి, ప్రతి చర్య ఉంటుందని నాగబాబు పోస్ట్‌ చేశారు. న్యూటన్స్‌ లాస్‌ అంటూ వరుసగా నాగబాబు పోస్టులు పెట్టారు. మిత్రధర్మం పాటించకుండా టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడంపై నిన్న కామెంట్లు చేశారు పవన్‌ కల్యాణ్‌. రెండు చోట్ల అభ్యర్థుల్ని కూడా ప్రకటించారు. ఇదే సమయంలో చర్యకు ప్రతిచర్య అంటూ నాగబాటు పోస్ట్‌ చేశారు. నేను పెట్టే ప్రతి పోస్ట్‌కి ఏదోక అర్థం ఉంటుందని అనుకోవద్దని... కొన్నిసార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటానని చెప్పారు నాగబాబు. వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దని తెలిపారు.


నేను పెట్టే ప్రతీ పోస్ట్ కి ఏదోక అర్ధం వుంటది అనుకోవద్దు కొన్ని సార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటాను,ఇవ్వాల Physics laws యే చేసాను రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను...
Note :
(వీటి గురించి ఆలోచించి గుమ్మడి కాయల దొంగలు అవ్వొద్దు) అంటూ నాగబాబు పోస్ట్ పెట్టడం చంద్రబాబు టార్గెట్‌గానేనన్న చర్చ జరుగుతోంది.

ఓ వైపు టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతుండగా.. మరోవైపు సోషల్‌ మీడియాలో మెగా బ్రదర్‌ నాగబాబు చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. చర్యకి, ప్రతి చర్య ఉంటుందని నాగబాబు పోస్ట్‌ చేశారు. న్యూటన్స్‌ లాస్‌ అంటూ వరుసగా నాగబాబు పోస్టులు పెట్టారు.

Also Read : Hyderabad Accident : హైదరాబాద్‌ పాతబస్తీలో ఘోర రోడ్డు ప్రమాదం

#janasena #nagababu #pawan-kalyan #chandrababu-naidu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి