Mood of the Nation: మూడోసారీ మోదీనే.. ఓటర్ల మూడ్‌ తేల్చేసిన 'ఇండియా టుడే'!

2024లో కూడా ప్రధానిగా మోదీనే విజయం సాధిస్తారని 'ఇండియా టుడే-సీవోటర్' 'మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే'లో తేలింది. 52శాతం మంది మోదీనే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారని.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీని 16శాతం మంది ప్రధానిగా చూడాలనుకుంటున్నారని సర్వే చెబుతోంది.

Mood of the Nation: మూడోసారీ మోదీనే.. ఓటర్ల మూడ్‌ తేల్చేసిన 'ఇండియా టుడే'!
New Update

ప్రధాని నరేంద్ర మోదీకి ఆదరణ తగ్గలేదని 'ఇండియా టుడే-సీవోటర్' 'మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే' తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది మోదీ మూడోసారి అధికారంలోకి రావడానికి అనుకూలంగా ఓటు వేసినట్టు తేలింది. మూడ్ ఆఫ్ ది నేషన్ ఆగస్టు ఎడిషన్ సర్వేలో 63 శాతం మంది ప్రధానిగా మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని నెలల క్రితం సర్వేతో పోల్చితే ఈ సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అప్పుడు ఏకంగా 72శాతం మంది మోదీ పనితీరుకు అనుకూలంగా ఓటు వేశారు. 2024 ఎన్నికల్లో మోదీ కారణంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తామని 44 శాతం మంది అభిప్రాయపడ్డారని 'మూడ్ ఆఫ్ ది నేషన్' పోల్ తెలిపింది. బీజేపీకి ఎందుకు ఓటు వేస్తారో చెప్పడానికి అభివృద్ధి, హిందుత్వ రెండు, మూడో కారణంగా ప్రజలు అభిప్రాయపడ్డారు.

లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోన్న మోదీకి ఉన్న ప్రజాదరణ తన రాజకీయ ప్రత్యర్థుల(రాహుల్‌) కంటే ముందంజలో ఉందని సర్వేలో తేలింది. 52 శాతం మంది ప్రధానిగా మోదీ బెస్ట్ అని.. సర్వేలో పాల్గొన్న వారిలో 16 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని అత్యున్నత పదవికి ఎన్నుకున్నారు.

శాతం తగ్గింది..!
మరోవైపు కాంగ్రెస్‌ మద్దతుదారులు మోదీకి ప్రజాదరణ తగ్గిందని చెబుతున్నారు. గతంలో జరిగిన సర్వేలో 72శాతంగా ఉన్న మోదీ సపోర్టర్లు ఇప్పుడు 52శాతానికి తగ్గారని.. ఇక ముందుముందు మరింత తగ్గుతుందని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ దూకుడు పెరిగిందని.. అదే సమయంలో మణిపూర్‌ అల్లర్లు మోదీ ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేశాయంటున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తల వాదను బీజేపీ సపోర్టర్స్‌ కొట్టిపారేస్తున్నారు. రాహుల్‌ గాంధీని కేవలం 16శాతం మంది మాత్రమే ప్రధానిగా చూడాలనుకుంటున్నారని.. ముందు మీ లెక్కలు చూసుకోని తర్వాత మిగిలిన వాళ్ల లెక్కలు చూడాలని చురకలంటిస్తున్నారు.

ధరల పెరుగుదల మోదీ ప్రభుత్వం నంబర్ 1 వైఫల్యంగా 'మూడ్ ఆఫ్ ది నేషన్' పోల్ చెబుతోంది. 'ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం, 25శాతం మంది ధరల పెరుగుదల మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం అని చెప్పారు. 17శాతం మంది నిరుద్యోగమని. 12శాతం మంది ఆర్థిక వృద్ధి అని తెలిపారు. ఇక NDA పనితీరుపై 59శాతం మంది సంతృప్తి చెందారని సర్వే తెలిపింది. 19శాతం మంది కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి చెందలేదని తెలిసింది. ఇక ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వ పనితీరుపై 67 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.

#india-today-c-voter-survey #mood-of-the-nation
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి