Crime: బిస్కెట్లు ఇస్తానని చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడు!

గంజాయి మత్తులో ఓ యువకుడు ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై ఆ చిన్నారిని హత్య చేశాడు.ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో జరిగింది. నిందితున్ని బీహార్‌ కు చెందిన దిలీప్‌ గా పోలీసులు గుర్తించారు.

Crime: బిస్కెట్లు ఇస్తానని చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడు!
New Update

Tirupati Crime: గంజాయి మత్తులో ఓ యువకుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఎనిమిదేళ్ల చిన్నారిని చిదిమేశాడు. బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై ఆ చిన్నారిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా దొరవారి సత్రం లో బుధవారం జరిగింది. బీహార్ నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్‌ మిల్లులో పని చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి. అందులో ఇద్దరు భార్య భర్తలు కూడా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తులు కాగా..రెండో కుమార్తె (8) కి దిలీప్‌ అనే వ్యక్తి బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఉదయాన్నే అడవిలోకి తీసుకుని వెళ్లాడు.

మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు పాప కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వెతికారు. సాయంత్రం 4 గంటల సమయంలో అటవీప్రాంతంలో బాలిక మృతదేహాన్ని చూసిన పశువుల కాపరులు వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్సీ శ్రీనివాసరెడ్డి, సీఐలు జగన్మోహన్‌ రావు, శ్రీనివాసులు రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో బాలిక నోటితో పాటు పలు శరీర భాగాల్లో కూడా గాయాలు ఉండడం పోలీసులు గమనించారు.

దిలీప్ బాలికను తీసుకుని వెళ్తున్న దృశ్యాలు మిల్లు సీసీ కెమెరాలో గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. బాలికకు బిస్కెట్లు కొనిచ్చేందుకు తీసుకెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని పోలీసులకు తెలిపాడు. గంజాయి మత్తులో నిందితుడు బాలిక పై అత్యాచారం, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే మంగళవారం రాత్రి దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడపడ్డాడు. మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని కఠినంగా శిక్షిస్తామని తిరుపతి ఎస్పీ సెల్‌ సుబ్బరాయుడు తెలిపారు.

Also read: మరికొన్ని గంటల్లో అకౌంట్లోకి రూ.1 లక్ష.. వారికి మాత్రమే!

#tirupati #ap-crime-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe