Master - chirajeevi :అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విభిన్నమైన కథలతో వెండితెరపై దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేశాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా చిత్రాలను తీస్తూ ఇప్పటివరకు ఉన్న ఫార్మూలాలను బ్రేక్ చేసిన ఘనాపాటి . సినిమా రూల్స్ బ్రేక్ చేసి ఎన్నిగంటలయినా థియేటర్స్లో కుర్చోపెట్టగల సత్తావున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రీసెంట్ గా రిలీజయిన యానిమల్ చిత్రం ఎన్ని వివాదాలను ఎదుర్కొందో తెల్సిందే. అయినా ఇవేమీ పట్టించుకోడు ఇప్పుడు ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేసింది. ఇలాంటి సక్సస్ ఫుల్ దర్శకుడు మెగా స్టార్ బీవీరాభిమాని అన్న విషయం తెలిసిందే.
చిరుతో యాక్షన్ సినిమా
ఇప్పటికే సందీప్ వంగా ఎన్నో సార్లు చిరు మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. సినిమాల్లోకి రావడానికి చిరంజీవియే ఇన్‌స్పిరేషన్ అని, ఆయన సినిమాలంటే ఇష్టమనే, ఆయనే తన ఫేవరేట్ హీరో అని ఎన్నో సార్లు నిర్మొహమాటంగా చెప్పేశాడు. చిరంజీవితో తప్పకుండా ఓ యాక్షన్ మూవీని చేస్తానంటూ యూఎస్ టూర్లో ఉన్నప్పుడు అక్కడి ఎన్నారై ఫ్యాన్స్‌తో ముచ్చటించినప్పుడు తన కోరికను బయటపెట్టేశాడు.సందీప్ రెడ్డి వంగా సినిమా ఫీల్డ్ కి రావడానికి చిరంజీవి ఇన్‌స్పిరేషన్ అనేది అందరికీ తెలిసిందే.
మాస్టర్ మూవీలో చిరు సిగరెట్ పట్టుకునే స్టైల్ అద్భుతం
Not Just Film Making, Fanism ki Kuda Standards Set Chesthunnav @imvangasandeep ❤️🔥
3 Decades Back Miru Chesina Movie loni Scenelo veskunna Shirt Color Chepthunnadu Bobby ki Chance Ichinattu Vanga ki Kuda Chance ivvandi @KChiruTweets Garu🙏
Plz Make it Happen @AlwaysRamCharan https://t.co/NbPKJZFiR8 pic.twitter.com/Jo8CjiN4j0
— Ujjwal Reddy (@MEHumanTsunaME) January 1, 2024
రీసెంట్గా మెగా స్టార్ చిరంజీవి గురించి, ఆయన నటన గురించి చెబుతూ సందీప్ వంగా గుర్తు చేసుకున్న సీన్ ఇప్పుడు సోదాలు మీడియాలో వైరల్ అవుతోంది. మాస్టర్ సినిమాలో సాక్షి శివానంద్‌కు తన గతం గురించి చెప్పే సీన్, అందులో చిరంజీవి వేసుకునే షర్ట్ కలర్‌తో సహా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందులో చిరంజీవి సిగరెట్ పట్టుకునే స్టైల్, తాగే తీరు, యాక్టింగ్ చేసే తీరు అద్భుతంగా ఉంటుందని, ఆ స్టైల్ చూసిన తరువాతే సిగరెట్ తాగాలని తనకు అనిపించిందంటూ ఇలా నాటి సీన్‌ను అంత క్లియర్‌గా చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.
Ila ra nuvvu @NostanStan adi vanga anthe ee interview ayyina boss gurinchi lekund interview complete cheyadu pic.twitter.com/BxDd7P8Oko
— Kings (@Observe99945) January 1, 2024
ఎంత పెద్ద అభిమాని అవ్వకపోతే.. సినిమాలను, సినిమాలోని సీన్లను, సీన్లలో వేసుకున్న షర్ట్‌ని గుర్తుంచుకుంటాడు. ఇదేం ఫ్యానిజం రా బాబు అని సందీప్ వంగాకు దండం పెట్టేస్తున్నారు. ప్రస్తుతం మాస్టర్ సినిమాలోని ఆ సీన్, సందీప్ రెడ్డి చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ రెండింటిని మెగా ఫ్యాన్స్ బాగానే వైరల్ చేస్తున్నారు.మరి .. సందీప్ జానర్ లోనే ఉంటుందా ? లేదా మెగాస్టార్ గురించి ఇంకేమైనా డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేస్తారా అనేది చూడాలి.
ALSO READ:Guntur Karam political punches:గుంటూరు కారం మూవీలో పొలిటికల్ పంచులు..!! టార్గెట్ ఎవరు ?