బీజేపీని ఢీ కొట్టేందుకు నేడు బెంగుళూరులో ప్రతిపక్షాల భేటీ..రంగంలోకి సోనియాగాంధీ..!!

ప్రతిపక్షాలు తమ బలాన్ని చాటేందుకు రెడీ అవుతున్నాయి. ఈసారి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రతిపక్షపార్టీల సమావేశానికి 24 పార్టీలు హాజరు కానున్నాయి. జూన్ లో బీహార్ సీఎం, జనతాదళ్ అధినేత నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ తోపాటు 15 పార్టీలు హాజరైన సంగతి తెలిసిందే. కాగాజూలై 17 నుంచి బెంగళూరులో రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిపక్ష పార్టీ సమావేశం ద్వారా అధికార కూటమికి సవాల్ విసిరేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాల పాట్నా సమావేశం తర్వాత నేషనిస్టు కాంగ్రెస్ పార్టీలో చీలక తీసుకొచ్చి...మహారాష్ట్ర సర్కార్ లో చేర్చుకుని గట్టిషాకిచ్చిన అధికార పక్షానికి ఏమాత్రం బలం తగ్గలేదని మరింత పెరిగిందని తెలిపేందుకు ఈ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

బీజేపీని ఢీ కొట్టేందుకు నేడు బెంగుళూరులో ప్రతిపక్షాల భేటీ..రంగంలోకి సోనియాగాంధీ..!!
New Update

సోమవారం నుంచి బెంగళూరులో జరిగే రెండు రోజుల ఐక్యతా సమావేశంలో దేశంలోని ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు పాల్గొని 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాల్సిన వ్యూహంపై మేధోమథనం చేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్‌పై కాంగ్రెస్ సమ్మతి తర్వాత ఈ సమావేశంలో 24 పార్టీలు పాల్గొంటాయని ప్రతిపక్ష వర్గాలు భావిస్తున్నాయి. గత నెల జూన్ 23న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి కేవలం 15 పార్టీలు మాత్రమే హాజరయ్యారు. బీజేపీని ఓడించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న లౌకిక ప్రతిపక్ష పార్టీల సంకల్పానికి బెంగళూరులో రెండు రోజులపాటు జరిగే సమావేశం ముందడుగు వేస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజ్ అన్నారు.

publive-image

సమావేశానికి పలువురు సీఎంలతో పాటు అగ్రనేతలు హాజరు:

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బెంగాల్ మమతా బెనర్జీ, బీహార్ నితీశ్ కుమార్, తమిళనాడుకు చెందిన ఎంకే స్టాలిన్, జార్ఖండ్‌కు చెందిన హేమంత్ సోరెన్, ఢిల్లీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు పంజాబ్‌కు చెందిన ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు. దీంతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

నిర్ణయాత్మక భేటీ:

ఈ భేటీ నిర్ణయాత్మక సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు అంశాలను పరిశీలించనున్నారు. అదే సమయంలో బెంగుళూరు సమావేశం తర్వాత బీజేపీపై తదుపరి చర్యలను మా అగ్రనేతలు ప్రకటిస్తారని మరో నేత తెలిపారు. గవర్నర్ల ద్వారా విపక్షాల పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు లేదా నియంత్రించేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర కూడా ఈ సమావేశంలో బట్టబయలు కానుంది. మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చీలిక, పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో భారీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో విపక్షాల సమావేశం జరుగుతోంది. బెంగాల్ హింసాకాండకు బీజేపీ కారణమని మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపించాయి.

శనివారం ఢిల్లీలోజరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక కమిటీ సమావఏశంలో ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ జైరాం రమేశ్ మాట్లాడు. దేశంలో సమాక్య వ్యవస్థఫై దాడి జరుగుతోందని..రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే కుట్ర జరుగుతున్నాయని..గరర్నల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పనులను చేస్తోందంటూ విమర్శించారు. ఈ చర్యలకు తాము వ్యతిరేకమని..రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చకు డిమాండ్ చేస్తామన్నారు.

మమతాకు సోనియా ఫోన్ :

కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి 24 పార్టీలు హాజరయ్యేందుకు సముఖుత చూపాయి. అయితే కాలి గాయం కారణంగా తాను రాలేకపోతున్నానంటూ టీఎంసీ అధినేత మమతా భెనర్జీ సందేశాన్ని పంపించారు. తనకు బదులుగా ప్రతినిధిని పంపిస్తామని చెప్పారు. దీంతో ప్రతిపక్షాల్లో ఐక్యత లేదంటూ అధికార కూటమని దుష్ర్పచారం ప్రారంభించే అవకాశం ఉంటుందని భావించిన కాంగ్రెస్ ఎలాగైనా మమతాను ఒప్పించాలని డిసైడ్ అయ్యింది.

దీంతో సోనియా గాంధీ రంగంలో దిగారు. స్వయంగా మమతా కు ఫోన్ చేసి..గాయం గురించి ఆరా తీశారు. పరామర్శించడంతోపాటుగా వీలుంటే బెంగళూరుకు రావాలంటూ మమతను కోరారు. పాట్నా సమావేశాన్ని రాహుల్, మల్లిఖార్జున ఖర్గే నిర్వహించగా...ఈ బెంగళూరు సమావేశాన్ని తానే నిర్వహిస్తున్నాను కాబట్టి ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని చెప్పినట్లు సమాచారం. సోనియాగాంధీ ఫోన్ తో మమతా మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe