India-China: చైనా సైన్యాన్ని ఎదిరించిన గొర్రెల కాపరులు.. కేంద్రం ఏమందంటే

వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల గొర్రెల కాపరులకు చైనా సైనికులకు మధ్య వాగ్వాదం జరిగడం తమ దృష్టికి వచ్చినట్లు కేంద్రం స్పందించింది. మూగజీవాలు మేత మేసే ప్రాంతంపై ఇరు దేశాలకు అవగాహన ఉందని, ఘర్షణలు జరిగితే సంబంధిత సంస్థలు స్పందిస్తాయిని తెలిపింది.

New Update
India-China: చైనా సైన్యాన్ని ఎదిరించిన గొర్రెల కాపరులు.. కేంద్రం ఏమందంటే

భారత్ - చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వద్ద గత కొన్నిరోజుల క్రితం భారత్‌కు చెందిన గొర్రెల కాపారులకు.. అలాగే చైనా సైన్యానికి మధ్య వాగ్వాదం జరిగిన ఓ వీడియో బయటపడింది. బార్డర్‌ ప్రాంతంలో భారత భూభాగం వైపు జీవాలను మేపకూడదంటూ పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (PLA) దళాలు అభ్యంతరాలు తెలిపాయి. కానీ భారత్‌కు చెందిన కాపరులు ఈ విషయాన్ని లెక్కచేయలదేని.. దీంతో వారు ఇండియన్ ఆర్మీ సాయంతో అక్కడి నుంచి చైనా సైనికుల్ని వెనక్కి పంపించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Also Read: ఏపీకి ప్రత్యేక హోదా.. ఢిల్లీలో వైఎస్ షర్మిల దీక్ష

ఇందుకు సంబంధించిన వీడియో మా దృష్టికి వచ్చిందని.. మూగజీవాలు మేత మేసే ప్రాంతం గురించి ఇరు దేశాలకు కూడా అవగాహన ఉందని విదేశాంగ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ తెలిపారు. ఏదైన వివాదం, ఘర్షణలు జరిగినట్లు తెలిస్తే.. సంబంధిత సంస్థలు స్పందిస్తాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. లడఖ్‌లోని కాక్‌జంగ్‌ గ్రామంలో ఈ వివాదం జరిగినప్పుడు ఇందుకు సంబంధించిన దృశ్యాలను చుషుల్‌ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిస్‌ ఇటీవలే షేర్ చేశారు.

ఇక 2020 ఏప్రిల్‌లో గల్వాన్ లోయ వద్ద భారత్ - చైనా సైన్యాల మధ్య ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఏకంగా 20 భారత జవాన్లు మృతి చెందారు. 1967లో భారత్- చైనా మధ్య జరిగిన అతిపెద్ద ఘర్ణణ ఇదే. ఈ ఘటన జరిగినప్పటి నుంచి వాస్తవాధీన రేఖకు దగ్గర్లో సంచార జాతుల వారు తమ గొర్రెలను మేపడం మానేశారు. 3 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇండియా ఆర్మీ సాయంతో.. ఆ కాపలాదారులు.. పీఎల్‌ఏ దళాలకు తమ హక్కును తెలిపారు. అలాగే సరిహద్దు ప్రాంత ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తున్నందుకు మన బలగాలకు కొంచోక్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: జార్ఖండ్ సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం..హైదరాబాద్‌కు ఎమ్మెల్యేలు

Advertisment
Advertisment
తాజా కథనాలు