Manoj Muntashir: ప్రభాస్,కృతిసనన్ జంటగా వచ్చిన భారీ బడ్జెట్ మూవీ 'ఆదిపురుష్' (Adipurush). ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో డైలాగ్స్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా దీనిపై తాజాగా స్పందించిన ఈ సినిమా మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ (Manoj Muntashir) తనది 100 శాతం తప్పేనని అంగీకరించారు.
Also read :ఫిట్నెస్ సెంటర్ కోచ్ వక్ర బుద్ధి.. యువతి స్నానం చేస్తుండగా ఏం చేశాడంటే?
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇష్యూపై మాట్లాడిన ఆయన.. సినిమా కోసం అద్భుతంగా మాటలు రాశానని ప్రశంసించుకునే అభద్రతా భావం తనకు లేదన్నాడు. 'నాది 100 శాతం తప్పే. శ్రీరాముడు, హనుమంతుడు, సనాతన ధర్మాన్ని (Sanatana Dharma) తప్పుగా చూపించాలనే చెడు ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. కాకపోతే ఈ విషయంలో పెద్ద తప్పే చేశా. ఈ ఘటన నుంచి ఎంతో నేర్చుకున్నా. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది.
డైలాగ్స్ విషయంలో వివాదం నెలకొన్నప్పుడు నేను సరిగ్గా స్పందించలేకపోయాను. అది కూడా పొరపాటే' అని అపాలజీ కోరారు. ఇక సినిమాలోని హనుమంతుడి డైలాగ్స్ విషయంలో వివాదం చెలరేగింది. హనుమంతుడితో ఇబ్బందికరమైన పదాలు మాట్లాడించడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో చిత్రబృందం అప్పట్లో క్షమాపణలు చెప్పి.. డైలాగ్స్ మార్చిన విషయం తెలిసిందే. ఇక రామాయణం ఆధారంగా రూపొందిన 'ఆదిపురుష్' సినిమాలో రాఘవగా ప్రభాస్ (Prabhas) , జానకిగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సుమారు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిని సినిమా భారీ అంచనాలతో రిలీజైనప్పటికీ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.