BC Politics: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తారా?

కాంగ్రెస్ పార్టీ చింతన్ సమావేశంలో బడుగులకు భిక్షవేస్తున్నట్లుగా 50 శాతం కేటాయిస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అటు కేంద్రంలోని బీజేపీతో బీసీలను మభ్యపెట్టేందుకు చూస్తోంది. బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా మోసం చేస్తున్నాయో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి.

BC Politics: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తారా?
New Update

బీసీ కులాలను అగ్రకులాలు అణచివేయడం ఇప్పటి విషయం కాదు. వందల సంవత్సరాలుగా ఉన్న ఈ అణచివేత స్వాతంత్ర్యం వచ్చినా కొనసాగింది.. కొనసాగుతోంది.. కొనసాగబోతోంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు బీసీలను ఎప్పుడూ ఓటు బ్యాంక్‌గానే చూస్తాయి.. వారి మంచి కోరినట్టు నటిస్తాయి. దీనికి కేవలం అగ్రకుల పార్టీల కులాహంకారమే కారణం కాదు.. విద్యలో బీసీల వెనుకబాటుతనం కూడా వారు మోసపోవడానికి ప్రధాన కారణం. విద్యలో వెనుకబాటుతనం కారణంగానే వీరికి జరుగుతున్న అన్యాయాన్ని వీళ్ళు వెంటనే పసిగట్టలేకపోయారు. అందుకే దేశంలోని ప్రజలందరికి స్వేచ్ఛ, సౌబ్రతౄత్వంగా ఉండాలని వేల సంవత్సరాలుగా అనేక అణచివేతలకు గురి అవుతున్న వాళ్ళకోసం రాజ్యంగ నిర్మాతలు వీళ్ళకు కొన్ని ప్రత్యేక హక్కులను, రిజర్వేషన్లను, భారత రాజ్యంగంలో కొన్ని ప్రత్యేకమైన నిబంధనలను ఏర్పరిచారు.

అయితే కాలక్రమేణ ఈ హక్కులను, రిజర్వేశన్లను, ప్రత్యేక నిబంధనలను అణిచివేయడానికి అగ్రకులాలకు చెందిన రాజకీయ పార్టీలు, నాయకులు ప్రయత్నాలను చేస్తున్నారు. వీళ్ళూ చేస్తున్నా ఈ మోసాలను గమనించకుండా, బీసిసమాజాన్ని తప్పుడు మార్గంలోకి నడిపించడానికి బీసి కులాలకు చెందిన నాయకులను తమ పక్కలో పెట్టుకుని,తమకు అనుకులంగా మలుచుకునే ప్రయత్నాలను చేయడం మొదలు పెట్టారు. ఇదే అదునుగా భావించిన బీసి కులాలకు చెందిన నాయకులు కూడా తమ తమ అవసరాల కోసం బీసి జాతులను వీళ్ళకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ ఓబిసి లేంటి...? ఆ కులాల లిస్టు లేదుకదా..?అది కుదరదని చెప్పించారు. ఐనా అంబెడ్కర్ ఒప్పుకోకుండా బీసీ కమీషన్ వేసి వెంటనే కులాలలిస్టు తయారుచేసి, బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్టికిల్ 340 లో ఉన్నట్టు పని జరగాలి అని పట్టు పట్టారు. ఆ తర్వాత ఆర్టికల్ 341 ఎస్సీ, ల కోసం, మరియు ఆర్టికల్ 342 ఎస్టీ ల కోసమని అట్టి ఆర్టికల్స్ ద్వారానే 15%, ఎస్సీలకు,7.5% ఎస్టీ లకు రిజర్వేషన్స్ అవకాశం కల్పించామని అధికారంలో ఉన్న నాయకులకు గుర్తు చేశారు కూడా... ఇలా అంబెడ్కర్ ఎన్ని సార్లు, అప్పటి ప్రభుత్వాన్ని అడిగినా పట్టుబట్టినా బీసీ కమిషన్ వెయ్యలేదు. అందువల్ల సెప్టెంబర్ నెల 27వ తేది 1951.లో అప్పటి ప్రభుత్వంతో విభేదించి అంబేడ్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా దారి తీసింది బీసీ కమిషన్ అంశమే అంబేద్కర్ మంత్రి పదవి రాజానామకు ప్రధాన కారణంగా మారింది. కనీసం అంబేద్కర్ రాజీనామా చేసిన కారణాలు పార్లమెంటులో చదివి వినిపిస్తానంటే ఆవకాశం కూడా ఇవ్వలేదు అప్పటి ఆధిపత్య సామజిక వర్గాల అధికార పార్టీ నాయకులు.

రాజీనామా తర్వాత త్వరలో జరగనున్న ఎన్నికల్లో(1952)లో బీసీల పట్ల ఆధిపత్య అధికార పార్టీ పాలకులు చేస్తున్న అన్యాయం చూవుతున్న నిర్లక్ష్య వైఖరిని జరుగుతున్న అన్యాయాలను బీసీల ముందు బయటపెట్టక తప్పదని అంబేద్కర్ చెప్పడం వల్ల నిజం గ్రహించి కంగారు పడి ప్రభుత్వానికి నిజంగానే నష్టం జరుగుతుందని తెలుసుకొని అప్పటి అధికార పెద్దలు ఆగమేఘాల మీద కాక కాలేల్కర్ చైర్మన్ గా కమిటీ వేసారు.ఐనా కూడా 1952లో జరిగిన ఎన్నికల్లో అంబెడ్కర్ తన పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్నే ప్రచారం చేసారు అది గమనించిన ఆధిపత్య సామజిక వర్గాల అధికారపార్టీ నాయకుల మనస్సుల్లో అంబెడ్కర్ బీసీలకు నాయకుడైపోతాడేమోనన్న భయాన్ని పరిస్థితిని కల్పించారు అంబెడ్కర్. అంతలోనే ప్రభుత్వం వేసిన కాలేల్కర్ కమిషన్ తన నివేదిక సిద్ధం చేసి ఓబీసీలు దేశంలో సామజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా వూర్తిగా అన్యాయానికి గురి కాబడుతున్నారని, జనాభ లెక్కల ప్రకారం అప్పటికే 52% ఉన్నారని అందువల్ల జనాభ ప్రాతిపదికనా ఓబీసీలకు 52% రిజర్వేషన్స్ ఇవ్వాలని రికమాండ్స్ కూడిన నివేదికలను రాష్ట్రపతికి రిపోర్టు సబ్మిట్ చేసారు. ఈ రిపోర్టు చూసిన రాష్ట్రపతి కంగారుపడి, అర్ధ రాత 12 గంటలకు దేశప్రధాని దేశ రాష్ట్రపతి ఒకే చాంబర్లో కూచొని ఈ కాలేల్కర్ నివేదిక ఆధిపత్య సామజిక వర్గాల అధికారానికి డెత్ వారెంటగా మారాబోతుందని గ్రహించి సమాలోచనలు చేసి ఇద్దరూ కోపంతో ఉగిపోతూ స్వాతంత్రం తెచ్చింది.

బీసీలకు సీట్లు (రిజర్వేషన్లు) పంచడానికా అని కాలేల్కర్ మీద మండిపడ్డారు అందుకే కలేల్కర్ మస్థాపం చెంది మరుసటిరోజు 31 పేజీల ఉత్తరాన్ని రాష్ట్రపతికి రాస్తూ...నా రిపోర్టుని మీరు ఆమోదించ వలసిన అవసరం లేదని సూచించారని మేధావుల వాదనలు చెవుతున్నాయి. రిపోర్టు తయారు చేసిన చైర్మనే ఆమోదించాల్సిన పనిలేదు అని రాసాడు కాబట్టి దీన్ని పారమెంటులో చర్చకు పెట్టవలసిన అవసరం లేదని అప్పటి ఆధిపత్య సామజిక అధికార పార్టీ నాయకులు పక్కకు పడేసారని నాటి బీసీ ఉద్యమ నేతల ఆరోపణలు చెవుతున్నాయి. తర్వాత కలేల్కర్ రికమెన్డ్ చేసిన కొన్ని కులాల నాయకుల్లోని పెద్దలకు పదవులిచ్చి, వాళ్ళతోనే మాకు రిజర్వేషన్లు వద్దని చెప్పించారు. ఆ కాలేల్కర్ రిపోర్టు ఎప్పుడూ వెలుగు చూడలేదు. 1977లో జనతాప్రభుత్వం దీన్ని ప్రచారానికి వాడుకుంది. తీరా గెలిచిన తర్వాత బీసీప్రతినిధులు వెళ్లి మురార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిని అడగ్గా... ఆ రిపోర్టుపాతదైపోయింది. కొత్తది వేయాలని చెప్పి 1979లో తన ప్రభుత్వం పడిపోయే ముందు మళ్ళీ కొత్తగా మండల్ కమీషన్ వేసాడు1980లోగెలిచిన ప్రభుత్వం కూడా మండల్ కమీషన్ రిపోర్టును పక్కన పడేసింది.దాన్ని 1989లో వి. పి సింగ్ బయటకు తీసి దైర్యంగా మండల్ కమిషన్ నివేదికలోని 40 అంశాలలోని కేవలం ఒకే ఒక నిర్ణయమైన విద్యా,ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలనే అంశాన్ని ఆమోదం చేసిబిల్లు పాస్ చేసినారు.

ఇది గమనించిన ఆధిపత్య రాజకీయ పార్టీలన్ని దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసి గందరగోళం సృష్టించి ప్రభుత్వాన్నిఅయోమయంలో పడవేశారు. వివిధ ఆధిపత్య సామజిక వర్గాల పార్టీలనాయకులు ఎలా పక్కదారి పట్టించారనే నిజం లోకమంతా తెలిసిందే...చివరకు సుప్రీం కోర్టు కల్పించుకొని వివరాలన్నీ పరిశీలన చేసి బీసీలకువిద్యా, ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు అమలు చేయాలని కొంత సమయంతరువాత తీర్పు చెప్పింది ఎట్టకేలకు బీసీలకు రిజర్వేషన్స్ అమలౌతున్నాయి.బీసీలు ఉన్నది 52% పైగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎందుకు బీసీలకుగ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్స్ అసెంబ్లీ, పార్లమెంట్లలో ఇవ్వడం లేదో బీసీలు ఆలోచన చేయాలి. ఇక అమ్మకు అన్నం పెట్టరు కానీ, పినతల్లికి బంగారు గాజులు చేయిస్తామంటారు అని తెలంగాణలో ఒక సామెత ఉంది. అన్ని పదవులలో బడుగులకు 50 శాతం కేటాయిస్తామంటూ రాజస్థాన్లో జరిగిన చింతన్ సమావే శంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానించడం ఆ సామెతను గుర్తుకుతెస్తోంది. అయితే ఈ తీర్మానంలో చిత్తశుద్ధి కన్పించడం లేదు. కాంగ్రెస్పార్టీ దృష్టిలో బడుగులు అంటే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు, నిజానికి రాజ్యాంగం ప్రకారం ఇప్పటికీ చట్టసభలలో ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఏడు శాతం రిజర్వేషన్ వంతుగా మొత్తంగా 23 శాతంరిజర్వేషన్ అమలవుతోంది. ఇక చింతన్ సమావేశంలో తీర్మానించినట్లుగా బడుగులకు 50 శాతం పదవులు కేటాయిస్తే బిసిలకు మిగిలేది 27 శాతం. అదీ కూడా భవిష్యత్తు మాట. ఎన్నికలు, సీట్ల కేటాయింపు వంటి అంశాలకు వచ్చేసరికి గెలుపు గుర్రాలు, సామాజిక సమీకరణలు, ఆర్ధికస్థితిగతులు ముందుకువస్తాయి. స్వాతంత్య్రం లభించిన తర్వాత గత ఏడు దశాబ్దాలుగా జరుగుతున్న తంతుఇదే.

ఎన్నికలకు ముందు రాజ కీయపార్టీ నేతలు చెప్పే మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. బిసిల అభ్యున్నతి పట్ల రాజకీయ పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మండల్ కమిషన్ సూచనలు యధావిధిగా అమలు చేస్తే చాలు. చెప్పాలంటే బి.పి. మండల్ కమిషన్ చేసిన సూచనలు బిసిల పాలిట బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పవచ్చు. బిసి అభివృద్ధికోసం మండల్ కమిషన్ విద్యా ఉద్యోగాల్లో 52 శాతం రిజర్వేషన్తోపాటు ఉద్యోగాల నియామకంలో రోస్టర్ విధానం ఏర్పాటు చేయాలని, ఉద్యోగాల ప్రమోషన్లలో బిసి రిజర్వేషన్ అమలు చేయాలని, స్థానిక సంస్థలలో 52 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వంటి మొత్తం 45 సూచనలు చేసింది. ఆ సూచనలలో బిసిలకు పార్లమెంటు, అసెంబ్లీ వంటి చట్టసభలలో కనీసం 52 శాతం రిజర్వేషన్ అమలుచేయాలనే సూచన కూడా చేసింది. మండల్ కమిషన్ నివేదిక తర్వాత భారతదేశాన్ని జాతీయ పార్టీలతోపాటు వివిధ ప్రాంతీయపార్టీలతో కూడా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు అధికారంలోకి వచ్చాయి. కానీ ఏ ఒక్కపార్టీ మండల కమిషన్ సూచనలు పూర్తిస్థాయిలో అమలు చేయాలనే ఆలోచన చేయలేదు. ఎన్నో పోరాటాల అనంతరం కేవలం విద్య, ఉద్యోగాలలో కమిషన్ చెప్పినట్లు 52 శాతం కాకుండా 27 శాతం రిజర్వేషన్ కేటాయింపు వంటి 9సూచనలు మాత్రం అమలు చేస్తున్నారు.

బిసి రిజర్వేషన్ల అమలు విషయానికివస్తే రాజకీయ పార్టీలు రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు గురించి చెబుతుంటాయి. అదే నిజమైతే తమిళనాడు రాష్ట్రంలో 61 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి? రాజకీయ పార్టీలు బిసి అభివృద్ధికి కట్టుబడి ఉండే పక్షంలో పెంచిన రిజర్వేషన్ల న్యాయస్థానాల పరిధిలోకి రాకుండా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించి అమలుచేయవచ్చు. తమిళనాడులో రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా 50శాతానికి మించి అమలు చేస్తున్నారు. కాంగ్రెస్పార్టీచింతన్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన మరో అంశం చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు. గతంలోమాదిరిగా కాకుండా ఈసారి కాంగ్రెస్పార్టీ అధికారంలోకి వస్తేమహిళల రిజర్వేషన్కు ఆమోదం తెలుపుతామని ప్రకటించింది.మహిళా రిజర్వేషన్ విషయంలో ఎవరికీ అభ్యంతరంలేదు. కాకపోతే మహిళలకు కేటాయించిన 33శాతం రిజర్వేషన్లలో బిసిలవాటా ఎంతో తేల్చమని మాత్రమే అడుగుతున్నారు. బిసిల వాటతేల్చకుండా 33 శాతం మహిళా రిజర్వేషన్ పేరుతో పెత్తందార్లకులాలకు ప్రయోజనం కలిగించడాన్ని బిసిలు అంగీకరించరు.ఈస్థితిలో రానున్న ఎన్నికల్లో బిసిల వాట తేల్చకుండా మహిళాబిల్లు ఆమోదిస్తామని కాంగ్రెస్పార్టీ ప్రకటించే పక్షంలో ఆ పార్టీకి నష్టమే జరుగుతుంది కాని ఎటువంటి ప్రయోజనం కలగదనిచెప్పవచ్చు.

కాంగ్రెస్ పార్టీ చింతన్ సమావేశంలో బడుగులకు భిక్షవేస్తున్నట్లుగా 50 శాతం కేటాయిస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్పార్టీకి చిత్తశుద్ధివుంటే కాంగ్రెస్పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మండల్ కమిషన్ నివేదికను యధాతథంగా అమలుచేస్తామని ప్రకటించి వుంటే బాగుండేది. మండల్ కమిషన్ లెక్కలప్రకారం బిసిలు జనాభాలో 52 శాతం మంది ఉన్నారు. కానీచట్టసభలలో బిసిల సంఖ్య ఏనాడు 20 శాతానికి మించలేదు.అగ్రకులాలు ప్రాధాన్యత కలిగిన హర్యానా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బిసి పార్లమెంటు సభ్యుల సంఖ్య 12శాతానికి మించడం లేదు. ఏడు దశాబ్దాలు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 7 దశాబ్దాలు అవుతున్నప్పటికీ నేటికీ బిసి జాబితాలో ఉన్న137కులాలలో 120 కులాలు నేటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు.చట్టసభలలో అడుగుపెట్టడం కోసం చేతివృత్తి కులాలవారుఎంతోకాలంగాఎదురుచూస్తున్నారు.

చట్టసభలో ఎగువ సభలు భావించేరాజ్యసభ, వివిధ రాష్ట్రాల్లోని విధానసభలకు ఎంపికయ్యే రాజ్యసభలు, శాసనమండలి సభ్యుల ఎన్నికల విషయంలో బిసిలకు తీవ్రంగా అన్యాయం జరుగుతోంది. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిఉండగా రద్దయిన లెజిస్లేటివ్ కౌన్సిల్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిహయాంలో పునరుద్ధరించడంతో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా అసెంబ్లీలో అడుగుపెట్టలేని అనేక బిసి కులాలకు చెందినవారు కౌన్సిల్ ద్వారా చట్టసభలలో అడుగుపెట్టే అవకాశం కలుగుతుందని ఎంతోఆశవడ్డారు. కాని కౌన్సిల్ ఏర్పడిన నాటినుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుఎంపిక చేయడంలో పార్టీ అవసరాలు, ఎత్తుగడలు, అవే కూడికలు, తీసివేతలు మినహా ఏ రాజకీయపార్టీ కొత్తగా ఏ సామాజిక వర్గా నికి అవకాశం కల్పించలేదు. రాజకీయపార్టీలు ఆర్థికంగా, సంఖ్యా పరంగా, బలంగా ఉన్న నాలుగైదు కులాలకు సీట్లు ఇచ్చి మొత్తం బిసిలను ఉద్దరించినట్లుగా చేస్తున్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి అసెంబ్లీలో ఉన్న 296 స్థానాలకుగాను కనీసం 148 స్థానాలు బిసిలకు చెండాలి. కాని ఆయా పరిస్థితులు, పార్టీ అవసరాలను బట్టి 90 నుంచి 100 స్థానాలకు మాత్రమే బిసిలకు కేటాయిస్తున్నారు. ఆస్థానాలను కూడా సంఖ్యా పరంగాను, ఆర్థికంగా ముందున్న కొన్ని కులాలకు చెందిన వారికి మాత్రమే కేటాయిస్తున్నారు. బిసిలలో తీరప్రాంతంలో సంఖ్యాపరంగా ఎక్కు వగా ఉండే రెండు, మూడు కులాలకు మాత్రమే కేటాయిస్తున్నారు.

అదే విధంగా సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న ఆయా సామాజిక వర్గాలకు చెందిన నాయకుల సీట్లు ఇస్తేదాలు. మిగిలిన బిసి కులా లను ఖాతరు చేయాల్సిన అవసరం లేదనే భావనలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. నిజానికి సంఖ్యాపరంగా ఆయాకులాలు ఆధి క్యత కలిగి ఉన్నప్పటికీ మిగిలిన కొన్ని కులాల సంఖ్యను కలిపితే 52శాతం బిసి జనాభాలో 40 నుంచి 50 శాతం ఉంటారు. కానీ విడివిడిగా ఆయా కులాల సంఖ్యా బలం తక్కువగా ఉండడం వల్ల వారిని వట్టించుకొనే స్థితి కన్పిం చడం లేదు. ఇప్పటి వరకు చట్టసభలో అడుగుపెట్టని కులాలను దృష్టిలో పెట్టుకొని ఎంబిసి ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు కొంత మంది బిసినేతలు బిసిలలో విభజన తీసుకురావడం మంచిదికాదం టున్నారు. నిజమే బిసిలలో విభజన తీసుకురావడం మంచిది కాదు. అలాగని ఏడు దశాబ్దాలుగా చట్టసభలో అడుగుపెట్టని కులాలకు చెందినవారు ఎప్పటికీ ఓటువేసే వారిగానే ఉండాలా? సమాజంలో సుమారు 56శాతం ఉన్న బిసిలకు అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించేవారు ఇప్పటివరకు చట్టసభలో అడుగుపెట్టని ఎంబీసీ
కులాలకు జరుగుతున్న అన్యాయం ఎందుకు ప్రశ్నించరు? ఇటువంటి అనేక ప్రశ్నలకు బిసి రిజర్వేషన్ బిల్లు ద్వారా సమాధానం లభించే అవకాశం కలు గుతుంది. అదే రాజ్యాంగపరంగా బిసిలకు సీట్లు కేటాయించే పక్షం లో ప్రతి రాజకీయపార్టీ అనివార్యంగా బిసిలకు నిర్దేశించిన సంఖ్య ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దాంతో మిగిలిన బిసి కులాలకుకూడా ఎంతోకొంత ప్రయోజనం కలిగేఅవకాశంఉంటుంది.

బిసి రిజర్వేషన్ల అమలు విషయానికి వస్తే రాజకీయ పార్టీలు రిజ ర్వేషన్లు మొత్తం 50శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు గురించి చెబుతుంటాయి. అదే నిజమైతే తమిళనాడు రాష్ట్రంలో 61 శాతం రిజర్వేషన్లు ఎలా అమలు అవు తున్నాయి? రాజకీయ పార్టీలు బిసిల అభివృద్ధికి కట్టుబడిఉండే పక్షంలో పెంచిన రిజ ర్వేషన్లను రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించి అమలు చేయవచ్చు. ఇటువంటి స్థితిలో కాంగ్రెస్ పార్టీతోసహా ఏ రాజకీయపార్టీ అయినా నిజంగా బిసిల పట్ల ప్రేమ, వారి అభివృద్ధిని కోరేవారైతే ఆయా రాజకీయ పార్టీలు తమ ఎన్ని కల ప్రణాళికలో మండల్ కమిషన్ సిఫార్సులను సంపూర్ణంగా అమలు చేస్తామని ప్రకటించాలి. అప్పుడు మాత్రమే పాలక పార్టీల నేతలపై బిసిలకు విశ్వాసం కలుగుతుంది. ఇక ప్రధానమైన పార్టీలు ఎన్నికల సమయంలోనే బీసీలకు గాలం వేయాలని చూస్తున్నాయి. బీసీ జనాభా లెక్కలు చేయాలని పార్లమెంట్లో బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ కోరినందుకే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కులాల వారి లెక్కలు తీయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. కావున కులాల వారి లెక్కలు తీయవలసిన అవశ్యకత ఉంది. సమయం మించిపోలేదు. పైగా దీనికి ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జనాభా లెక్కలు వస్తాయి.

01/08/2018 నాడు హోం శాఖామంత్రి మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జరిపిన హోంశాఖ ఉన్నత స్థాయి సమావేశంలో జనాభా గణనలో బీసీ కులాల వారు లెక్కలు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. రెండోసారి అధికారంలో కి రాగానే ఎందుకు మార్పు వచ్చింది? జనాభా లెక్కలు తీస్తే అణచివేతకు గురైన కులాల వారు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిస్తే వారు తిరగబడి అన్ని రంగాలలో ముఖ్యంగా బడ్జెట్లో, అధికారంలో తమ వాటా తమకు ఇవ్వాలని అడుగుతారేమోనని పాలకవర్గాలు భయపడు తున్నట్లు కనిపిస్తుంది. రాజ్యాంగంలోని 15 (4) (5) మరియు 16(4) (5) ప్రకారం బీసీ కులాలకు విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా ఉంది. జనాభా లెక్కలు లేకుండా రిజ ర్వేషన్లు ఏ ప్రాతిపదికన పెడతారు? రాజ్యాంగం 5 243 (6) 243 5 (6) ప్రకారం స్థానికసంస్థతో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఉంది. రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు లేదా రిజర్వేషన్లు పెంచిన ప్రతి సందర్భంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రతిపాదికన రిజర్వేషన్లు పెడతారని ప్రభుత్వా న్ని ప్రశ్నించాయి. ఇలా వందల కేసుల్లో సుప్రీం కోర్టు, హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించినా ఈ ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఈ దేశంలో అన్ని వర్గాల వివరాలను జనాభా గణన ద్వారా సేకరిస్తున్నారు. చివరకు పులులు, కుక్కలు. నక్కలు. జంతువుల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ బీసీ కులాల వారిగా జనాభా లెక్కలు లేకపోవడం అన్యాయం.

మన్నారం నాగరాజు
తెలంగాణ లోక్‌సత్తా పార్టీ
రాష్ట్ర అధ్యక్షుడు

#bc-politics #nagaraju-mannaram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి