BIG BREAKING: వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి 

ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన.. 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నుంచి బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

BIG BREAKING: వైసీపీకి షాక్.. పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి 
New Update

Ap: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన వైసీపీ (YCP), టీడీపీ (TDP), జనసేన (Jenasena) పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీ కండువాలు మారుస్తుండగా తాజాగా వల్లభనేని బాలశౌరి (Balashauri) సంచలన నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడుగా ఉన్న వల్లభనేని బాలశౌరి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు.

జనసేన నుంచి బరిలోకి..
ఈ మేరకు 2019 లోక్‌సభ ఎన్నికలలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 46.02శాతం పోల్ ఓట్లతో గెలిచారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొనకళ్ల నారాయణరావుపై 60,141 మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే తాజాగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM Jagan) చేపట్టిన మార్పులు, చేర్పుల కారణంగా టికెట్‌ రాని ఆశావాహులు నిరాశతో వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పేర్ని నానితో గొడవలు.. 
అలాగే 2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనసేన నుంచి బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆయన గత కొంతకాలం నుంచి అసంతృప్తిగా ఉన్నారని, మచిలీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నానితో బాలశౌరికి పొసగడం లేదని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో అధినాయకత్వం కూడా పేర్ని నానికి అండగా నిలివడంతో తనకు సీటు రాదని భావించిన బాలశౌరి.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ  మచిలీపట్నం నుంచి పోటీ చేయాలని భావించినా టిక్కెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసి ఈ దిశగా అడుగులేస్తున్నారు. వంగవీటి రాధాను మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీకి పోటీకి దింపాలని యోచనలో ఉందని తెలియడంతో బాలశౌరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన కుమారుడికి అవనిగడ్డ సీటు కూడా ఇవ్వడం లేదని తేలడంతో ఎంపీ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారని సమాచారం.

ఇది కూడా చదవండి : AI: హాలీవుడ్ హీరోలను మించిన అందం.. ఏఎన్ఆర్ ఏఐ లుక్స్ వైరల్

2004 లోక్‌సభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన 54.47శాతం ఓట్లతో గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుపై 78,556 మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇక 2008లో నియోజకవర్గాన్ని రద్దు చేసి గుంటూరు నియోజకవర్గంలో విలీనం చేసే వరకు ఎంపీగా పనిచేశారు వల్లభనేని బాలశౌరి.

#resigned #ycp #ap #mp-balashauri
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి