MLC: దెబ్బకి ఆర్సీబీ గుర్తొచ్చింది భయ్యా.. బాబోయ్.. 50రన్స్‌కి ఆలౌటయ్యారు..!

మేజర్ లీగ్ క్రికెట్(MLC)టోర్నీలో కేకేఆర్‌ ప్రాంచైజీ లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్‌ 50పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబై ఇండియన్స్‌ జట్టు MIన్యూయార్క్‌తో జరిగిన మ్యాచులో 50 పరుగులకే కుప్పకూలిన నైట్‌రైడర్స్‌.. 105 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

MLC: దెబ్బకి ఆర్సీబీ గుర్తొచ్చింది భయ్యా.. బాబోయ్.. 50రన్స్‌కి ఆలౌటయ్యారు..!
New Update

ఏ జట్టైనా వరుసపెట్టి విజయాలు సాధిస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్‌ గుర్తొస్తుంది.. అద్భుతాలు సృష్టిస్తుంటే ముంబై ఇండియన్స్‌ గుర్తొస్తుంది..అదే దరిద్రం దశావతారాలు ఎత్తితే మాత్రం అందరికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్సే గుర్తుకు వస్తుంది. అది వాళ్ల కర్మ అంతే. మేజర్ లీగ్ క్రికెట్(MLC)లో అసలు బెంగళూరుకు ఫ్రాంచైజీనే లేదు..అయినా కూడా ప్రతి మ్యాచ్‌లోనూ ఆర్సీబీని తలచుకుంటున్నారు అభిమానులు. శాన్ ఫ్రాన్సిస్కో ఓపెనర్‌ ఫిన్ అలెన్ లేజీగా అవుటైతే..అతను ఆర్సీబీ ప్లేయర్ అంటూ ముడిపెట్టి ట్రోల్ చేసేశారు..ఇక తాజాగా లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్‌ 50పరుగులకే వికెట్లన్ని సమర్పించుకుంటే ఇక్కడ కూడా ఆర్సీబీనే గుర్తొచ్చింది అభిమానులకు. ప్రపంచంలో ఏ మూల క్రికెట్ లీగ్ జరిగినా ఆర్సీబీ ప్రస్తావన లేకుండా ముగియడంలేదంటే అర్థంచేసుకోవచ్చు ఆ జట్టు ఫాలోయింగ్‌ ఎలా ఉంటుందన్నది.. ట్రోలింగో.. పొగడడమో అటు ఉంచితే ఆర్సీబీ గురించి చర్చ మాత్రం జరగాల్సిందే..!


పరువు పాయే..:
మేజర్ లీగ్ క్రికెట్(MLC)టోర్నీలో కేకేఆర్‌ ప్రాంచైజీ లాస్ ఏంజిల్స్ నైట్‌రైడర్స్‌ ఘోరంగా ఆడుతోంది. వరుసగా రెండో మ్యాచులోనూ ఓడింది. ముంబై ఇండియన్స్‌ జట్టు MIన్యూయార్క్‌తో జరిగిన మ్యాచులో 50 పరుగులకే కుప్పకూలిన నైట్‌రైడర్స్‌.. 105 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఐపీఎల్‌లోనూ ముంబై, కోల్‌కతా మధ్య జరిగే మ్యాచ్‌ల్లో అంబానీ జట్టుదే ఆధిపత్యం. అక్కడ కేకేఆర్‌పై 20సార్లు కంటే ఎక్కువ సార్లు గెలిచిన రికార్డు ముంబైకి ఉండగా.. MLCలోనూ తమ హవా కొనసాగించింది ముంబై. జట్టులో ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, మార్టిన్ గప్టిల్, రిలీ రోసౌ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నా.. లాస్ ఏంజిల్స్ జట్టు కనీస పోటీని ఇవ్వలేకపోయింది. టీ20 చరిత్రలో నైట్‌రైడర్స్‌ టీమ్‌కి ఇదే ఘోర పరాజయం.

మ్యాచ్‌ ఎలా సాగిందంటే..
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై న్యూయార్క్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(48 నాటౌట్) పరుగులతో రాణించగా.. నికోలస్ పూరన్(38) పర్వాలేదనిపించాడు. లాస్ ఏంజిల్స్ బౌలర్లలో అలిఖాన్, ఆడమ్ జంపా, కోర్న్ డ్రై రెండేసి వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్ ఓ వికెట్ పడగొట్టాడు. తర్వాత 156 పరుగుల లక్ష్యచేధనకు దిగిన నైట్‌రైడర్స్ 13.5 ఓవర్లలో 50 పరుగులకే కుప్పకూలింది. ఉన్ముక్త్ చంద్(26) ఒక్కడే రెండెంకెల స్కోర్ చేయగా.. మిగిలిన బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మార్టిన్ గప్టిల్(0), నితీశ్ కుమార్(0), కార్న్ డై(0), లాకీ ఫెర్గూసన్(0)‌లతో మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఆండ్రీ రస్సెల్(2) చేసిన కీరన్ పోలార్డ్ యూనిక్ సెలెబ్రేషన్స్ ఎంజాయ్ చేశాడు. MI బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, రబడా, ఎహ్‌సన్ ఆదిల్, కీరన్ పోలార్డ్, నస్తూష్ కెనిజే తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

ఆర్సీబీ గుర్తొచ్చింది భయ్యా:

ఐపీఎల్ చరిత్రలో తక్కువ పరుగులకే ఆలౌటై కొన్ని జట్లు చెత్త రికార్డును మూట కట్టుకున్నాయి. 2017లో కేకేఆర్ జట్టు, ఆర్సీబీని కేవలం 49 పరుగులకే ఆలౌట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోరు. 2009లో ఆర్సీబీ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 58 పరుగులకే ఆలౌటైంది. ఇది రెండో అత్యల్ప స్కోరు కావడం విశేషం. 2023లో రాజస్థాన్‌ను మరోసారి ఆర్సీబీ 59 పరుగులకే కట్టడి చేసింది. తాజాగా మేజర్ లీగ్ క్రికెట్‌లో నైట్‌రైడర్స్‌ జట్టు 50పరుగులకే ఆలౌట్ అయ్యింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe