ఒంగోలులో ఇసుక టిప్పర్ బీభత్సం.. ముక్కలు ముక్కలైన లెక్చరర్

ఒంగోలు నగర శివారు వెంగముక్కపాలెం రోడ్డులోని శ్రీకర విల్లాస్‌ వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. శ్రీకర విల్లాస్ కు ఇసుక రవాణ చేస్తున్న టిప్పర్ బైక్ పై వెళ్తున్న లెక్చరర్ చిరంజీవిని బలంగా ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మరణించాడు. శరీర భాగాలు, బైక్ ముక్కలు ముక్కలయ్యాయి.

ఒంగోలులో ఇసుక టిప్పర్ బీభత్సం.. ముక్కలు ముక్కలైన లెక్చరర్
New Update

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు జిల్లాలో ఇసుక టిప్పరు బీభత్సం సృష్టించింది. ఇసుక రవాణ చేస్తున్న లారీ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యార్థులకు పాఠాలు బోధించి ఇంటికి వెళ్తున్న ఓ లెక్చరర్ ను బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. అతను ప్రయాణిస్తున్న బైక్ ముక్కలు ముక్కలు అయింది. ఈ భయంకరమైన ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

ఒంగోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ సంఘటన ఒంగోలు నగరశివారు ప్రాంతం వెంగముక్కపాలెం రోడ్డులోని శ్రీకర విల్లాస్‌ వద్ద శనివారం ఉదయం జరిగింది. మండలం కేంద్రంలోని యరజర్ల గ్రామానికి చెందిన కంకణాల చిరంజీవి అనే వ్యక్తి.. క్విస్ కళాశాలలో పనిచేస్తున్నారు. అయితే ఈరోజు ఉదయం విధులకు హాజరయ్యేందుకు బైక్ పై కళాశాలకు వెల్తున్నాడు. ఈ క్రమంలోనే ఇసుక లోడుతో ఉన్న టిప్పర్‌ శ్రీకర విల్లాస్‌లోకి వెళుతుండగా ఎదురుగా వచ్చిన మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో  చిరంజీవితో సహా బైక్ పూ టిప్పర్‌ టైర్లు ఎక్కడంతో శరీరం, బైక్ నుజ్జునుజ్జయ్యాయి. సమాచారం తెలియగానే సీఐ భక్తవత్సలరెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా.. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే చిరంజీవి మరణించాడని, బైక్ ముక్కలు చూస్తే లారీ ఎంత వేగంగా ఉందో అంచనావేశామని పోలీసులు తెలిపారు.

ఇదికూడా చదవండి :జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. దాబాలోకి దూసుకెళ్లిన లారీ

ఇదిలావుంటే.. ప్రమాదం జరిగిన చోట ఆ ఇసుక టిప్పర్ కనిపించకపోవడంతో మృతుడు చిరంజీవి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొట్టడంవల్లే చిరంజీవి చనిపోయాడని, కేసును తప్పదోవ పట్టించేందుకు పోలీసులకు కుమ్మక్కు అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు సమక్షంలో మృతదేహన్ని రిమ్స్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని టిప్పర్‌ను ఆర్టీవో కార్యాలయానికి తరలించారు.

ఈ ప్రమాదంలో మరణించిన చిరంజీవి తండ్రి శ్రీనివాసరావు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఛిద్రమైన శరీరభాగాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తాను సంఘటన స్థలానికి చేరకముందే మృత దేహాన్ని రిమ్స్‌కు తరలిచడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమంలో బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు పోస్టుమార్టం చేయవద్దని  చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటుగా టీడీపీ నాయకులు రిమ్స్‌ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. మృతు డికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఆ కుటుంబానికి న్యా యం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కేసును పూర్తిగా పరీశీలించి బాధితుడికి న్యాయం చేస్తామని సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు.

#chiranjeevi #ongole #tipper-lorry #accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి