ఎర్నాకులంకు చెందిన ఓ యువకుడు ఓ యువతితో లివింగ్ టుగెదర్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఆ తర్వాత యువతిని ఆ యువకుడు వేధించినట్లు సమాచారం. దీని తర్వాత, యువకుడు తనపై గృహ హింసకు పాల్పడ్డాడని యువతి ఫిర్యాదు చేసింది. కేసు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో కేసు దాఖలైంది.
కేసు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తులు.. ‘‘యువకుడిపై గృహహింస కేసు నమోదు చేయడం తప్పు. లివింగ్ టుగెదర్ రిలేషన్‌షిప్‌లో భాగస్వామిని మాత్రమే భాగస్వామి అని పిలుస్తారు. ఆ సంబంధం పెళ్లి కాదు. జీవిత భాగస్వామిని భర్త అని పిలవలేము. చట్టబద్ధంగా వివాహం చేసుకుంటే మాత్రమే అతన్ని భర్త అని పిలుస్తారు. భాగస్వాముల నుండి శారీరక లేదా మానసిక వేధింపులు గృహ హింస పరిధిలోకి రావు, ”అని వారు చెప్పారు.