Bath Tips: ఈ సమస్యలున్నాయా? అయితే వేడి నీళ్లతో స్నానం చేయవద్దు! కాలేయం, జీర్ణ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లకు దూరంగా ఉండాలి. వీరు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే మంచిది. వేడి నీళ్లతో స్నానం చేస్తే అపానవాయువు, అజీర్ణం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది కడుపుని వేడి, ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదింప చేస్తుందని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 22 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bath Tips: నీళ్ళతో తడిపి,నీళ్ళలో మునిగి శుభ్రపరచుకోవటాన్ని స్నానం అంటారు. ప్రతిరోజూ చేసే స్నానానికి పాలు, నూనె, తేనె వంటి ద్రవపదార్ధాలను ఉపయోగిస్తారు. మన శరీరం శుభ్రంగా ఉండాలన్న, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్న రోజూ స్నానం చేయాలి. చలికాలంలో స్నానం అంటేనే చలికి బయపడుతారు. ఈకాలంలో వేడి నీళ్లలో స్నానం చేస్తారు.అయితే.. ఏడాది పొడవునా వేడినీటితో స్నానం చేసేవారుంటారు. వేడి నీళ్లలో స్నానం చేయడం శరీరానికి మంచిదా..? దీని వల్ల ఏవైనా సమస్యలు వస్తాయా..? అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. ఆ విషయాల గురించి నిపుణులు ఏమంటున్నారో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. వేడి నీళ్లలో స్నానం చేస్తే: శీతాకాలంలో వేడి నీళ్లలో స్నానం చేస్తే లాభాలతో పాటు నష్టాలున్నాయి. శీతాకాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వేడి నీళ్లతో స్నానం చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కానీ.. వేడి నీటి స్నానం అందరికీ మంచిది కాదంటున్నారు. ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లతో స్నానం చేయకూడదని చెబుతున్నారు. కాలేయం, జీర్ణ సమస్యలు ఉన్నవారు వేడి నీళ్లకు దూరంగా ఉండాలి. ఈ సమస్యలున్న వారు చల్లటి నీళ్లతో తలస్నానం చేస్తే మంచిది. వేడి నీళ్లతో స్నానం చేస్తే అపానవాయువు, అజీర్ణం వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది కడుపుని వేడి, ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియను నెమ్మదింప చేస్తుందని వైద్యులు అంటున్నారు. వేడి నీళ్లతో స్నానం చేస్తే రాత్రి నిద్ర బాగా పడుతుంది. వేడి నీళ్లలో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వేడి నీటిలో స్నానం చేయడం గుండెకు కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పొటాటో ఫింగర్స్ ను ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #water-bath #hot-water #digestive-problems #liver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి