కర్నాటక రాష్ట్రంలో బెంగళూరులో విలావంతమైన జీవనం కోసం మారువేషం వేసి వీధుల్లో భిక్షం అడుగుతున్న వ్యక్తిని బాగలగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలగుంటకు చెందిన చేతన్ హిజ్రా వేషంలో భిక్షాటన చేయటం ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్న చేతన్‌కు పిల్లలున్నారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన చేతన్ డబ్బుల కోసం మహిళ వేషం వేసి హిజ్రాలతో కలిసి నాగసంద్ర మెట్రోస్టేషన్ వద్ద భిక్షాటన చేస్తున్నారు.
డబ్బులివ్వని వారిపై దౌర్జన్యం చేసేవాడు. నాగసంద్ర మెట్రోస్టేషన్ వద్ద ఆక్రమంగా షెడ్ వేసుకున్నాడు. ఈనెల 13న బీఎంఆర్‌సీఎల్ అధికారులు షెడ్‌ను తొలగించే విషయంపై పరిశీలన చేయగా అధికారులపై కూడా దౌర్జన్యం చేశాడు. స్థానికులు పట్టుకొని చేతన్‌ను చితకబాది అసలు విషయాన్ని బహిరంగం చేశారు. అనంతరం బాగలగుంట పోలీసులు చేతన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇదిలాంటే కొన్ని రోజుల క్రితం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ హిందూ వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళ అవతారం ఎత్తిన ఉదంతం వెలుగుచూపిన విషయం తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం శక్తి యోజన పథకం కింద మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఈ ఉచిత బస్సు పథకాన్ని పొందాలని ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళగా అవతారం ఎత్తాడు. తాను భిక్షాటన చేసేందుకే తాను బురఖా ధరించి మహిళ వేషం వేశానని వీరభద్రయ్య అన్నారు. కానీ అసలు విషయం ఆరా తీస్తే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసమే బురఖా వేసుకొని ఆడ వేషం కట్టినట్లు వెల్లడైంది. ఉచిత బస్సు ప్రయాణం కోసం వీరభద్రయ్య వేషం మార్చి మహిళగా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇలా ఏదో ఒక విషయంతో కర్నాటక రాష్ట్రంలో జరుగుతునే ఉన్నాయి.