నిద్ర అనేది ఆరోగ్యానికి తప్పనిసరి. ఒక్క రోజు నిద్ర లేకపోతే నీరసం అయిపోతారు. రోజంతా ఎలాంటి పని చేయకుండా డల్‌గా ఉంటారు. అయితే మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి చెందాలంటే రాత్రిపూట ఈ ఒక్క పని చేస్తే చాలు.. హాయిగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Etela Rajender: రేవంత్ నీ బతుకెంతా.. ఈటల సంచలన వ్యాఖ్యలు
తినే ఫుడ్ ఈజీగా..
పూర్తిగా నిద్రపట్టని వారు.. రాత్రిపూట గోరువెచ్చని గ్లాసు నీరు తాగాలి. ఇలా చేస్తే హాయిగా నిద్రపడుతుంది. అలాగే తినే ఫుడ్ కూడా తేలికగా జీర్ణమవుతుంది. వీటితో పాటు కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడుతున్నవారికి గోరువెచ్చని నీరు బాగా సాయపడతాయి. కేవలం గోరు వెచ్చని నీరు తాగడమే కాకుండా స్నానం చేసిన కూడా రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.
ఇది కూడా చూడండి: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!
గోరువెచ్చని నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థకు కూడా విశ్రాంతి కలుగుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు. రోజంతా కష్టపడి పనిచేసి రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే పెద్ద నరకం. ఇలాంటి బాధ పడకుండా ఉండాలంటే గోరువెచ్చని నీరు తప్పకుండా తాగాల్సిందేనని నిపుణులు అంటున్నారు. గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.
ఇది కూడా చూడండి: 9 ఏళ్లకే గర్భం దాల్చిన బాలిక.. షాకింగ్ వీడియో వైరల్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!