ప్యాక్డ్ ఆరెంజ్ జ్యూస్
నేటి సమాజంలో ప్రేసర్వేటివ్స్ ట్రెండ్ బాగా పెరిగింది. ప్రతీదీ ఇన్స్టెంట్ గా దొరికిపోతుంది. వాటిలో పండ్ల రసాలు ఒకటి. ప్రజలు తరచూ వివిధ పండ్ల రసాల ప్యాకెట్లను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసి తాగుతూ ఉంటారు. ఇలా ప్యాక్ చేసిన ఆరెంజ్ జ్యూస్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చేపల నుంచి లభిస్తాయి. దాదాపు ప్యాక్ చేసిన ప్రతీ ఫ్రూట్ జ్యూస్ లు ఇలాగే ఉంటాయి.
వైట్ షుగర్
ప్రతీ ఇంట్లో వైట్ షుగర్ వినియోగం ఉంటుంది. అయితే దీని తయారీలో జంతువుల పదార్థాలను కలుపుతారు. చక్కెరను తెల్లగా పాలిష్ చేయడానికి జంతువుల ఎముకల పొడిని ఉపయోగిస్తారు.
రెడ్ క్యాండీస్
సాధారణంగా పిల్లలకు రెడ్ క్యాండీస్ చాలా ఇష్టమైనవి. ప్యూర్ వెజిటేరియన్స్ వీటిని తినాలకుంటే జాగ్రత్తగా ఉండండి. రెడ్ క్యాండీస్ స్వచ్ఛమైన వెజ్ ఐటమ్ కాదు. క్యాండీస్ కు ఎరుపు రంగు ఇవ్వడానికి ఆ రంగుల్లోని కొన్ని ఆరోగ్యకరమైన కీటకాలు, పురుగులను ఉపయోగిస్తారు.
బటర్ నాన్
శాకాహారులు వెజ్ ఐటమ్స్ లో ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ బటర్ నాన్ విత్ పన్నీర్ కర్రీ. అయితే బటర్ నాన్ నాన్ వెజ్ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. బటన్ నాన్ తయారు చేసేటప్పుడు పిండి మృదువుగా సాగేందుకు దాంట్లో గుడ్డు కలుపుతారు. కొన్ని చోట్ల గుడ్డు లేకుండా కూడా తయారు చేస్తారు.
చూయింగ్ గమ్
చూయింగమ్ ఒక ఆహరం కానప్పటికీ పిల్లలు నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరు దీన్ని తినడానికి ఇష్టపడతారు. అయితే చూయింగ్ గమ్‌లో జెలటిన్ నేచర్ కోసం ఆవులు, పందుల వంటి జంతువుల చర్మం, ఎముకల ఉత్పత్తిని ఉపయోగిస్తారు. ప్యూర్ వీగన్స్ కు మాత్రం ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.