Fenugreek Water : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫాస్ట్ లైఫ్‌లో ఏదో ఒక వ్యాధిని ఎదుర్కొంటున్నారు. మధుమేహం చాలా తీవ్రమైన జీవనశైలి సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి నుంచి బయటపడాలనుకుంటే.. జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా మాత్రమే సాధ్యమౌతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆహారాన్ని మెరుగుపరచడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా వ్యాధి నుంచి ఉపశమనం ఉంటుంది. మందులే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని నియంత్రించడానికి కొన్ని ఇంటి నివారణలను చిట్కాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు మెంతి గింజలను తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధికి మెంతి గింజలు ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎలా తీసుకోవాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Also Read: మహారాష్ట్రలో షిండే సక్సెస్ కు 5 ప్రధాన కారణాలివే!
మెంతి గింజలతో మధుమేహానికి చెక్:
- డయాబెటిస్‌తో బాధపడేవారికి మెంతికూర తీసుకోవడం చాలా మంచిది. మెంతికూరలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను తగ్గించి శరీరం కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడాన్ని తగ్గిస్తుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ విటమిన్ అండ్ న్యూట్రిషన్ రీసెర్చ్ ప్రకారం.. ప్రతిరోజూ 10 గ్రాముల మెంతి గింజలను గోరువెచ్చని నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారిలో బ్లడ్ షుగర్‌ని తగ్గించే సామర్థ్యం మెంతి గింజల నీటిలో ఉంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే ఇన్సులిన్‌ని మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దానికోసం ఒక గిన్నె నీటిలో మెంతి గింజలను రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి.
ఇది కూడా చదవండి: Aus Vs Ind: బుమ్రా దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు గజగజ.. 104 ఆలౌట్!
మెంతులు తీసుకునే విధానం:
- అర టీస్పూన్ మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. మెంతులు గింజలను నమలడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మెంతి గింజలను తినలేకపోతే.. మెంతి పొడిని కూడా ఉపయోగించవచ్చు.
స్థూలకాయం:
- స్థూలకాయం సమస్య ఉంటే కూడా మెంతి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. త్వరగా బరువు పెరుగుతుంటే.. ఆహారంలో మెంతులు చేర్చుకుంటు మంచి ఫలితం ఉంటుంది. మెంతి నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది కడుపు నిండుగా ఉంచుతుంది, కేలరీల తీసుకోవడం తగ్గిస్తుంది. మెంతులు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also read: మహారాష్ట్రలో సీఎం పోరు.. షిండే VS ఫడ్నవీస్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం
ఇది కూడా చదవండి: చలికాలంలో పొడిబారిన చర్మ సమస్య ఇలా పోతుంది