Health Tips: ప్రస్తుత కాలంలో చాలా ఉద్యోగాల వలన చాలా జీబిగా ఉంటున్నారు. దీని శరీరంపై, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. జిమ్‌కి వెళ్లడానికి లేదా ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి సమయం లేకపోతే.. టెన్షన్ పడాల్సిన పని లేదు. మెట్లు ఎక్కేటప్పుడు వ్యాయామం చేసినంత ఎక్కువ కేలరీలు బర్న్ చేయవచ్చు. ఇంట్లో, ఫీసులో మెట్లు ఎక్కి దిగడం వల్ల కండరాలు బలపడతాయి. దీంతో పాటు బెల్లీ ఫ్యాట్ తొలగిపోతుంది. బీపీ, మధుమేహం అదుపులో ఉండటంతోపాటు గుండె, మెదడు బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు సార్లు మాత్రమే మెట్లు ఎక్కడం శరీరానికి చాలా మేలు చేస్తుంది. మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని విషయాలపై ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం:
- రోజుకు ఒక్కసారైనా మెట్లు ఎక్కడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని దృఢపరచుకోవచ్చని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. మెట్లు ఎక్కడం సంబంధిత వ్యాధుల ప్రమాదం, రక్త ప్రసరణ, గుండె కండరాలను బలపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంద.
ఊపిరితిత్తులకు మేలు:
- క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. ఇది శ్వాసకోశ వ్యవస్థకు ఆక్సిజన్‌ను ఎక్కువగా అందేలా చేస్తుంది. అందుకే అందరూ మెట్లు ఎక్కాలని నిపుణులు సూచిస్తున్నారు.
కీళ్ల నొప్పులు రావు:
- మెట్లు ఎక్కడం వల్ల కీళ్లకు బలం చేకూరుతుంది. ఇది కాళ్ళు, తుంటి, కోర్ కండరాలను బలపరుస్తుంది. ఇది కీళ్ల నొప్పులు వంటి సమస్యలను నివారిస్తుంది.
ఊబకాయాన్ని తగ్గిస్తుంది:
- అధిక బరువు ఉన్నట్లయితే దానిని తగ్గించడానికి మెట్లు ఎక్కి క్రిందికి వెళ్లాలి. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. జీవక్రియను పెంచి ఊబకాయం, బరువు తగ్గిస్తుంది.
మధుమేహం, రక్తపోటు అదుపు:
- మెట్లు ఎక్కి దిగడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. జీవక్రియను మెరుగుపరచడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు భోజనం చేసిన తర్వాత మెట్లు ఎక్కితే ప్రయోజనం ఉంటుంది.
మానసిక ఆరోగ్యం:
- మెట్లు ఎక్కడం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగి మంచి నిద్ర వస్తుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరూ పగటిపూట తప్పనిసరిగా మెట్లు ఎక్కాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
Also Read: కుమురంభీంలో విషాదం.. పులి పంజాకు యువతి బలి