spiny Gourd: వర్షాకాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఆహరం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంలో సీజనల్ కూరగాయలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. వాటిలో ఒకటి బోడ కాకరకాయ. ఇది అడవి కూరగాయ.. సాధారణంగా అటవీ ప్రాంతాలలో మాత్రమే పెరుగుతుంది. ఈ కూరగాయను అనేక సమస్యలకు ఔషధంగా పరిగణించబడుతుంది. వీటిని తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
బోడ కాకరకాయ ప్రయోజనాలు
- మధుమేహ వ్యాధిగ్రస్తులు బోడ కాకరకాయ మంచి ఎంపిక. దీనిలోని ఫైబర్‌తో పాటు అధిక నీటి శాతం మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. బోడ కాకరకాయలో మంచి మొత్తంలో మొక్కల ఇన్సులిన్ ఉంటుంది. అందుకని డయాబెటిక్ రోగులకు ఇది సరైన ఎంపికగా పరిగణిస్తారు.
- శరీరంలో క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్ ను తొలగించడానికి బోడ కాకరకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది విటమిన్ సి , సహజ యాంటీ-ఆక్సిడెంట్స్ కు గొప్ప మూలం. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించి క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
- బీటా కెరోటిన్, లుటీన్, జాంక్సెథిన్, ఫ్లేవోనైట్ వంటి పోషకాలు బోడ కాకరకాయలో పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలన్నీ చర్మానికి చాలా మేలు చేస్తాయి, వృద్ధాప్యాన్ని నివారిస్తాయి.
- బోడ కాకరకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో ఫైటోన్యూట్రియెంట్లు అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 100 గ్రాముల బోడ కాకరకాయలో 17 గ్రాముల కేలరీలు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గడంతో కూడా తోడ్పడుతుంది.
- సాధారణంగా వర్షాకాలంలో అలర్జీలు చాలా త్వరగా మొదలవుతాయి. బోడ కాకరకాయ సహజ వ్యతిరేక అలెర్జీ కారకంగా పనిచేస్తుంది. దాని అనాల్జేసిక్ లక్షణాల కాలానుగుణ దగ్గు , ఇతర రకాల అలెర్జీల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- బోడ కాకరకాయ మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తొలగించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కావున ఈ సీజన్‌లో బోడ కాకరకాయని ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Also Read: Lord Shiva: ఇండియాలో ఎత్తైన శివలింగాలు ఇక్కడ ఉన్నాయి..? - Rtvlive.com