Trainee Doctor : పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజధాని కోల్‌కతా (Kolkata) లో ట్రైనీ డాక్టర్‌ను హత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కానీ అతడి తల్లి మాలతీ రాయ్ మాత్రం తన కొడుకు నిర్ధోషి అని.. పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును ఒప్పకున్నాడని ఆరోపించింది.
పూర్తిగా చదవండి..West Bengal : ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. నిందితుడికి నాలుగు పెళ్లిళ్లు
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడికి నాలుగు పెళ్లిళ్లు అయినట్లు విచారణలో తేలింది. నిందితుడి దుష్ప్రవర్తన వల్లే ముగ్గురు భార్యలు విడిచిపెట్టారని.. నాలుగో భార్య క్యాన్సర్‌తో చనిపోయినట్లు పేర్కొన్నారు.
Translate this News: