మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కిరీట్ సోమయ్య చిక్కుల్లో పడ్డారు. తనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను మరాఠీ ఛానెల్ బ్లర్ చేసి మరీ టేలిక్యాస్ట్ చేసింది. ఈ వీడియోలో కిరిట్ సోమయ్య ఇంటిమేట్ పొజిషన్‌లో ఉన్నారంటూ ఛానెల్ చూపించింది. అయితే ఇది రాజకీయ కుట్ర అని ఆరోపించారు సోమయ్య. వీడియోపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోమయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో శివసేన ఉద్దవ్ వర్గం నాయకుడు అంబదాస్ దన్వే ఈ విషయాన్ని శాసనమండలిలో లేవనెత్తుతామన్నారు.
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే కిరీట్ సోమయ్య డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. ఆ వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. దీంతో పాటు ఫుటేజీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తన పరువు తీయాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని సోమయ్య అంటున్నారు. నేను అమాయకుడినని..ఈ వీడియోతో తనకేలాంటి సంబంధం లేదంటున్నారు. తనో ఓ కుంభకోణాన్ని బయట పెట్టినందుకే తనపై ఈ కుట్ర జరిగిందంటూ ఆరోపించారు.
కిరీట్ సోమయ్యకు సంబంధించిన లైంగిక కుంభకోణాన్ని ఇవాళ శాసన మండలిలో లేవనెత్తుతామని శాసనమండలి ప్రతిపక్ష నేత అంబదాస్ దాన్వే తెలిపారు. బీజేపీ ఎప్పుడూ నైతికత గురించి మాట్లాడుతుందని కాంగ్రెస్‌కు చెందిన యశోమతి ఠాకూర్ అన్నారు. ఇప్పుడు కిరీట్ సోమయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిరీట్ సోమయ్య స్వయంగా అసభ్యకర చర్యలకు పాల్పడినప్పుడు ఇతరులను కించపరిచే నైతిక హక్కు ఆయనకు లేదని శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నేత విద్యా చవాన్ మండిపడ్డారు.
అటు ఈ వీడియోపై మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి వర్సా గైక్వాడ్ స్పందిస్తూ...ఈ వార్త చాలా అసహ్యం కలిగించిందన్నారు. ఒక మరాఠీ వార్తా ఛానెల్ బయట పెట్టిన కిరిట్ సోమయ్యవీడియో చూసి అసహ్యం కలిగింది. పరిపాలనలో స్వీయ స్టైల్ టార్చ్ బేరర్ ఇప్పుడు బట్టబయలైంది. ఎవరి ..నైతికత ప్రశ్నార్థకమైనదో వారు ప్రజా నైతికతకు మధ్యవర్తులుగా నటిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. బీజేపీ సర్కార్ బేటీ బచావ్, బేటీ పడావో అని ప్రచారం చేస్తుంటే..నాయకులు మాత్రం అనైతిక ప్రవర్తతో పట్టుబడుతున్నారంటూ మండిపడ్డారు.