Supreme Court : 25 వేల టీచర్ ఉద్యోగాల రద్దుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు...

Supreme Court: పశ్చిమబెంగాల్‌, కేరళ గవర్నర్‌ కార్యాలయాలకు సుప్రీం కోర్టు నోటీసులు
New Update

Teacher Jobs : 25 వేలకు పైగా ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు(Calcutta High Court) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం నాడు స్టే విధించింది. పశ్చిమ బెంగాల్‌(West Bengal) లో దాదాపు 26 వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ(CBI) దర్యాఫ్తును కొనసాగించవచ్చునని తెలిపింది. అయితే అభ్యర్థులు లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది.

బెంగాల్‌లో 25,743 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించి చోటు చేసుకున్న కుంభకోణంలో కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 22న సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ చేపట్టిన నియామక ప్రక్రియ చెల్లదని అందులో పేర్కొంది. ఆ నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఉద్యోగులు తమ వేతనాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

Also Read : పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో నీరజ్ చోప్రా..!

#teacher-jobs #supreme-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి