Bihar : బీజేపీ వద్దు... ఇండియాకే మద్దతంటున్న ఎల్‌జేపీ నేతలు

బీహార్‌లో ఎన్డీయే పార్టీకి షాక్ తగిలింది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలో లోక్‌జనశక్తి పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. 22 మంది సీనియర్ నేతలు పార్టీని వెళ్ళిపోయారు. ఇక మీదట తమ మద్దతు ఇండియా కూటమికే అని ప్రకటించారు.

Bihar : బీజేపీ వద్దు... ఇండియాకే మద్దతంటున్న ఎల్‌జేపీ నేతలు
New Update

Lok Jana Shakthi Party : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్నవేళ ఎన్డీయే(NDA) కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. చిరాగ్‌ పాశ్వాన్‌(Chirag Paswan) నేతృత్వం ఉన్న పార్టీ నుంచి 22 మంది సీనియర్‌ నేతలు వెళ్ళిపోయారు. పార్టీకి రాజీనామా చేసి.. ఇండియా కూటమికి మద్దతుగా ఉంటామని మరీ ప్రకటించారు. వీరిలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, బిహార్‌ మాజీ మంత్రి రేణు కుశ్వాహా, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్‌ కుమార్‌, రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్‌, రవీంద్ర సింగ్‌ వంటి కీలక నేతలు ఉన్నారు. నేతలంతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు రాజు తివారీకి రాజీనామా లేఖలు సమర్పించారు.

సీట్లు అమ్ముకున్నారు..

నేతలంతా పార్టీలో అంతర్గత విభేదాలే కారణం అని తెలుస్తోంది. అంతేకాదు లోక్‌సభ ఎననికల్లో పార్టీ సీట్లను అమ్మకుంటోందని ఆరోపిస్తున్నారు. సమస్తీపుర్‌, ఖగడియా, వైశాలి లోక్‌సభ స్థానాల కోసం రూ.కోట్లు తీసుకున్నారన్నారు. చిరాగ్ పాశ్వానే స్వయంగా ఈ పని చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికలకు అభ్యర్ధులను ఖరారు చేసే ముందు కనీసం పార్టీలో సీనియర్లను అడగలేదని...వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ప్రస్తుతం టికెట్లు కేటాయించిన వారి మీద కూడా వెళ్ళిపోయిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మేమేమైనా కార్మికులమా..

పార్టీలో ఎప్పటి నుంచో ఉండి.. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి కాకుండా.. బయటవారికి టికెట్లు ఇచ్చారు. అంటే పార్టీలో సమర్ధులు లేరనే అనుకుంటున్నారని అర్ధం కదా...అలాంటప్పుడు తాము పార్టీలో ఉండి ఏం ప్రయోజనం అని అడుగుతున్నారు సీనియర్ నేతలు. పార్టీ కోసం పని చేసి వేరే వాళ్ళను నాయకులను చేయడానికి మేమే ఏమైనా కార్మికులమా అని ప్రశ్నిస్తున్నారు. అందుకే మా మద్దతు ఇక మీదట ఇండియా కూటమికే అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు పార్టీని వీడి వెళ్ళిన నేత కుశ్వాహ. ఎన్డీయే కూటమిలో భాగంగా ఎల్‌జేపీ(LJP) కి 5 స్థానాలు కేటాయించారు. వాటిలో హాజీపూర్‌, వైశాలి, ఖగడియా, సమస్తీపూర్‌, జముయీ ఉన్నాయి. హాజీపూర్‌ నుంచి చిరాగ్‌ పోటీ చేస్తుండగా.. ఆయన సమీప బంధువు అరుణ్‌ భారతీ జముయీ నుంచి బరిలోకి దిగుతున్నారు.

Also Read : రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. 8 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

#bihar #ljp #chirag-paswan #nda
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి