జనాభా పరంగా కాపులకు ఏపీలో అతిపెద్ద ఓటు బ్యాంక్ ఉంది. ఈ కులాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాన్ని రచిస్తుంటాయి. 2019అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు వైసీపీ పక్షానే నిలపడ్డారు. వచ్చేసారి ఎవరికి సపోర్ట్ ఇస్తారో ఇప్పటికైతే తెలియదు కానీ కాపు కులానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కమ్మ కులానికి చెందిన చంద్రబాబునాయుడు పార్టీకి నేరుగా సపోర్ట్ ఇవ్వడాన్ని కొంతమంది కాపు నేతలు వ్యతిరేకిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి వెళ్లడంపై కాపు క్యాస్ట్ రెండు వర్గాలుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ పవన్ నిర్ణయానికి సపోర్ట్ ఇస్తుంటే మరో వర్గం మాత్రం జనసేన నిర్ణయానికి మద్దతు ఇవ్వడంలేదు. విజయవాడ ఐలపురం కన్వేన్షన్ సెంటర్‌లో వంగవీటి రంగ, రాధ అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. పవన్ కల్యాణ్ టార్గెట్‌గా రంగా, రాధ అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కి రంగా సహచరులు, అభిమానులు, సన్నిహితులు హాజరయ్యారు.
రంగాని చంపిన వారితోనే??
రంగాని చంపిన వ్యక్తులతో కాపు నేతలు కలిసి తిరగడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. రంగా లక్ష్యాలను, ఆశయాలను తాకట్టు పెట్టి అధికారాన్ని కట్టాబేట్టాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా పవన్‌కు చురకలంటించారు. రంగా లక్ష్యాలను, ఆశయాలను కాపాడుకోవడం కోసం ఈ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. లక్ష్యాలను సజీవంగా ఉంచుకోవడం కోసం తీసుకోవాల్సిన చర్యలను సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ఉద్యమాలకి విజయవాడ నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు.
విభేదాలను పక్కన పెట్టాలి:
ప్రజల అవసరాలకు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలిసి పనిచేశామంటున్నారు అభిమానులు. రంగా ఆశయాలను, లక్ష్యాలను గౌరవించే రక్తసంబంధీకులు ఎవరు ఉన్నా వారితో కలిసి పనిచేస్తామని.. ఆయన వారసులమని చెప్పుకొని.. ఆ మహనియుడి ఆశయాలకు లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్న రక్త సంబంధువులు ఎవరైనా వారిపై పోరాడుతామని చెప్పారు. ఇది పరోక్షంగా రంగా కుమారుడు రాధకి వ్యతిరేకంగా వేసిన కామెంట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాధ టీడీపీలోనే ఉన్నారు. అయితే యాక్టివ్‌గా లేరు. ఆయన జనసేనలో చేరుతారంటూ ఇటివలి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అటు జనసేన టీడీపీకి నేరుగా మద్దతిన్చింది. ఈ పరిణామాలు ఎప్పటినుంచో కాపులను రిప్రెజంట్ చేస్తున్న నేతలకు నచ్చడంలేదని సమాచారం. ఇంతకాలం ఎవర్ని అయితే వ్యతిరేకించామో వారినే సపోర్ట్ చేసే పరిస్థితులను కొంతమంది తీసుకొచ్చేవిధంగా ప్రయత్నిస్తుండడాన్ని అంగీకరించలేకపోతున్నారు.
ALSO READ: పవన్ నిర్ణయంతో జనసేనకు కాపుల ఓట్లు దూరం కానున్నాయా? ప్చ్.. రాంగ్ స్టెప్?