జులైలో బాక్సాఫీస్ బొనంజా, బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన బేబీ

టాలీవుడ్ కు జులై నెలలో 2 పెద్ద హిట్స్ పడ్డాయి. వీటిలో ఒకటి పెద్ద సినిమా కాగా, రెండోది చిన్న సినిమా కావడం విశేషం. జులై నెలలో ఏ వారం ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

జులైలో బాక్సాఫీస్ బొనంజా, బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన  బేబీ
New Update

టాలీవుడ్ కు జులై నెలలో 2 పెద్ద హిట్స్ వచ్చాయి. వీటిలో ఒకటి పెద్ద సినిమా కాగా, రెండోది చిన్న సినిమా కావడం విశేషం. జులై నెలలో ఏ వారం ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, వాటి రిజల్ట్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

జులై మొదటి వారంలో.. సర్కిల్, ఓ సాథియా, రుద్రంగి, గ్యాంగ్ లీడర్, 7.11 పీఎం, రంగబలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో నాగశౌర్య హీరోగా నటించిన రంగబలిపై మంచి అంచనాలుండేవి. అయితే ఆ అంచనాల్ని రంగబలి అందుకోలేకపోయింది. నాగశౌర్యకు ఫ్లాప్ తప్పలేదు. దీంతోపాటు వచ్చిన మిగతా సినిమాలు కూడా ఫెయిలయ్యాయి. అలా జులై నెల డల్ గా మొదలైంది.

డల్ గా ఉన్న బాక్సాఫీస్ కు ఆక్సిజన్ అందించింది బేబి సినిమా. జులై రెండో వారంలో రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది.  ఏ మాత్రం అంచనాలు లేకుండా, పెద్ద హీరో హీరోయిన్లు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం అందుకుని చిన్న చిత్రాలకు కొత్త ఊపునిచ్చింది.  నిర్మాత ఎస్కేఎన్ కు 3 రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది.  ఇదిలా ఉంటే  బేబీ దర్శకుడు సాయి ప్రకాష్ కి,   హీరో విశ్వక్ సేన్ కు మధ్య తలెత్తిన వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది.  సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ ఓ హీరోకు తన కథ చెప్పటానికి ప్రయత్నిస్తే కనీసం వినలేదని  కామెంట్ చేశారు.  ఆ హీరో ఎవరనేది దర్శకుడు పైకి చెప్పకపోయినా, దీనిపై హీరో విశ్వక్ సేన్ స్పందించటంతో తెరవెనక జరిగిన విషయాలన్నీ బయటకొచ్చాయి. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో పాపులరయిన వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటించింది. హీరో ఆనంద్ దేవరకొండ. సినిమా హిట్ కావటంతో వైష్ణవికి అవకాశాలు వచ్చి వాలుతున్నాయి. తాజాగా రామ్ హీరోగా   పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే చిత్రంలో ఆమె నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.

ఈ మూవీతో పాటు రెండో వారంలో వచ్చిన నాయకుడు, భారతీయన్స్, మహావీరుడు, రివెంజ్, బోగన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

జులై మూడో వారంలో.. ఒక్కడే వీరుడు, అలా ఇలా ఎలా, హత్య, డిటెక్టివ్ కార్తీక్, అన్నపూర్ణ ఫొటోస్టూడియో, కార్తీక, హిడింబ, నాతో నేను, హెర్, సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో ఒక్క సినిమా కూడా క్లిక్ అవ్వలేదు. రుహానీ శర్మ నటించిన హెర్, అశ్విన్ బాబు చేసిన హిడింబ, విజయ్ ఆంటోనీ నటించిన హత్య సినిమాలు వేటికవే ఫ్లాప్ అయ్యాయి.

జులై నాలుగో వారంలో.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బ్రో సినిమా రిలీజైంది. పవన్, సాయితేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ స్కీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ల వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాతో పాటు వచ్చిన స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమా ఫ్లాప్ అయింది.

ఓవరాల్ గా జులై నెలలో పెద్ద సినిమా వచ్చిన బ్రో, చిన్న సినిమాగా వచ్చిన బేబి సినిమాలు మాత్రమే క్లిక్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. ఆగస్ట్ లో భోళాశంకర్ థియేటర్లలోకి వస్తోంది.

#movie #cinema-review #july
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe