Telangana Elections: తెలంగాణలో ఇప్పుడు వెరీ ఫోకస్‌డ్ నియోజకవర్గం ఏదంటే.. జనగామ అని చెప్పుకోవచ్చు. అవును మరి, రాష్ట్ర రాజకీయాలు ఓ లెక్క.. జనగామ రాజకీయాలు మరో లేక్క అన్నట్లుగా అక్కడ పరిస్థితి. ఓవైపు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. మరోవైపు పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఒకరపై ఒకరి కత్తులు దూసుకునేంత రక్తి కట్టిస్తున్నారు రాజకీయాన్ని. తెలంగాణ(Telangana)లోని 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్.. కొన్ని సీట్లను మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు. ఆ సస్పెన్స్ లిస్ట్‌లో ప్రధానంగా ఉన్నది జనగామ. అదే ఇప్పుడు అక్కడ పరిస్థితిని మరింత రసవత్తరంగా మార్చింది. జనగామ(Jangaon) సీటుపై ఎప్పటి నుంచో పల్లా కన్ను వేశారని పొలిటికల్ సర్కిల్‌లో టాక్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన కూడా ఓపెన్ అయిపోతున్నారు. ఇక ముత్తిరెడ్డి సైతం అంతే ధీటుగా రియాక్ట్ అవుతున్నారు. జనగామ టికెట్ మళ్లీ నాకే అని, సీఎం కేసీఆర్ న్యాయం చేస్తారంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా జనగామ టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు గట్టిగానే చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య టికెట్ పోరు పీక్స్‌కు చేరింది. అయితే, తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారట. అది ముత్తిరెడ్డికి మరింత కోపాన్ని తెప్పించింది. ఇంకేముంది.. ఆయన బహిరంగంగానే పల్లా పేరును ప్రకటిస్తూ అగ్గిమీదగుగ్గిలం అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆయన రోడ్డెక్కారు. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నాకు దిగారు. తన అనుచరులతో కలిసి నల్లా జెండాను పట్టుకుని నిరసన తెలిపారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
జనగామ సెంటర్‌లో చొక్కా విప్పిన ముత్తిరెడ్డి..
పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ జనగామ సెంటర్‌లో నిరసన చేపట్టారు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపిన ఆయన.. ఒక్కసారిగా మరో టర్న్ తీసుకున్నారు. చొక్కా విప్పేసి అర్థనగ్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు ముత్తిరెడ్డి. ఉద్యమం అంటే ఏంటో తెలియని వ్యక్తులు.. ఇప్పుడు కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు ముత్తిరెడ్డి. ఉద్యమ కాలంలో కేసీఆర్‌ను కాపాడుకున్నామని గుర్తు చేశారు. డబ్బు సంచులతో వచ్చి కుట్రలు చేస్తున్నారంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
Also Read:
TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం..