Meda Srinivas: జనసేన గ్లాస్ సింబల్ నాదే- మేడా శ్రీనివాస్ జనసేన గ్లాస్ సింబల్ తనదేనంటున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేత మేడా శ్రీనివాస్. గ్లాస్ గుర్తు తమ పార్టీకే కేటాయించాలని వ్యాఖ్యానించారు. అవసరమైతే సుప్రీం కోర్టులో తేల్చుకుంటానని ఖరకండిగా చెప్పేశారు. By Jyoshna Sappogula 11 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Meda Srinivas: జనసేన గ్లాస్ సింబల్ తనదేనంటున్నారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేత మేడా శ్రీనివాస్. అవసరమైతే సుప్రీం కోర్టులో తేల్చుకుంటానని ఖరకండిగా చెప్పేశారు. 1998లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. గ్లాస్ గుర్తు కేటాయించాలని మే 2023న అప్లై చేసామని.. జనసేన డిసెంబర్ లో అప్లై చేసిందని వెల్లడించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించిందిని ఆరోపిస్తున్నారు. కాగా, జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ దాఖలైంది. గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్. గతేడాది మే 13న గాజు గ్లాస్‌ను ఫ్రీ సింబల్‌గా ఈసీ ప్రకటించిందని గుర్తు చేశారు. గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. ఈసీతో (EC) సంప్రదింపులు చేస్తున్న సమయంలో గాజు గ్లాసును జనసేనకు కేటాయించారని పిటిషనర్ చెబుతున్నారు. ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు, జనసేన పార్టీని చేర్చారు. Also Read: మంత్రి రోజా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్.. సింహంతో కాదు దీంతో పోల్చుకోండి: పృథ్వీరాజ్ రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గత నెల జనవరి 25న ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన పార్టీ (Janasena Party) తరపున పోటీ చేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఈసీ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ చేసింది. గత ఎన్నికల్లో ఏపీలో, తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపైనే (Glass Symbol) పోటీ చేసింది. ఈసారి కూడా, జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేసేలా ఈసీ ఆదేశించింది. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి