AP Cabinet: పవన్ కళ్యాణ్‌కు మూడు మంత్రి పదవులు?

AP: చంద్రబాబు కేబినెట్‌లో పవన్ కళ్యాణ్ చేరే అంశంపై సస్పెన్స్ నెలకొంది. పవన్‌ మంత్రివర్గంలో చేరితే డిప్యూటీ సీఎంతో పాటు రెండు కీలక శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

AP Cabinet: పవన్ కళ్యాణ్‌కు మూడు మంత్రి పదవులు?
New Update

AP Cabinet: ఏపీ కేబినెట్‌ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. చంద్రబాబు కేబినెట్‌లో పవన్ కళ్యాణ్ చేరే అంశంపై సస్పెన్స్ నెలకొంది. పవన్‌ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా?.. తన ఎమ్మెల్యేలకు ఛాన్స్‌ ఇచ్చి తాను ఇతర బాధ్యతలు తీసుకుంటారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. పవన్‌ మంత్రివర్గంలో చేరితే డిప్యూటీ సీఎంతో పాటు రెండు కీలక శాఖలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై రెండ్రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

జనసేన 5 నుంచి 6 కేబినెట్ మంత్రులను అడిగే ఛాన్స్ సీనియర్‌ నేత నాదెండ్లకు కీలక శాఖను కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి. కేబినెట్‌లో చేరే అంశంపై పార్టీ నేతలతో చర్చించి పవన్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక 2014 కేబినెట్‌లో బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం.. ఈసారి కూడా ఇద్దరికి చోటు దక్కొచ్చని అంచనా ఉంది. బీజేపీ సీనియర్లు సుజనా, కామినేని, సత్యకుమార్‌, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక టీడీపీ నుంచి కేబినెట్‌లోకి ఎవరెవరిని ఎంచుకుంటారు?, లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా?, పార్టీపరంగా కీలక బాధ్యతలు చూసుకుంటారా అనే దానిపైనా చర్చ మొదలైంది.

#ap-cabinet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి