సన్నాసుల మాటలను ప్రజలు వినొద్దు
తెలంగాణలో కాంగ్రెస్ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయని, మూడెకరాల పొలం తడవాలంటే 3 గంటల కరెంట్ సరిపోతుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్, జీవన్‌రెడ్డి, శ్రీధర్ బాబు ఏం సమాధానం చెబుతారు? అంటూ కేటీఆర్ నిలదీశారు. టీపీసీసీ అధ్యక్షుడు రాసిందే రాత, గీసిందే గీత అన్నట్టుగా పరిస్థితి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ సన్నాసుల మాటలను ప్రజలు వినొద్దని సూచించారు. కాంగ్రెస్ రాబందుల పార్టీ అని అభివర్ణించారు. రాహుల్ గాంధీకి ఎడ్లు, వడ్లు తెలియవని, ఆయనకు తెలిసిందల్లా పబ్బు, క్లబ్బు మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
క్షమాపన చెప్పాలి
జగిత్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ గత 50 ఏళ్లుగా రైతులకు నీరు, కరెంట్, ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదని అన్నారు. అంతేకాదు రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణమని అన్నారు. కరెంట్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను మేము కండిస్తున్నామని కేటీఆర్ అన్నారు. టీకాంగ్రెస్ వెంటనే క్షమాపన చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. జీవన్‌రెడ్డి లాంటి వారు కండిచ్చకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
ఎప్పుడు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉంది
కాంగ్రెస్ హయంలో గ్రామాల్లో రైతన్నలకు ఎనాడన్న 6 గంటలు కాంగ్రెస్ కరెంట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ఎరువులు, విత్తనాల దుకాణం ముందు చెప్పుల లైన్లు పెట్టించిన వారు కాంగ్రెస్ కాదా అని అన్నారు. అంతేకాదు దేశ చరిత్రలో రైతుబందు లాంటి కార్యక్రమం ఎక్కడైనా ఉందాని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారాని ప్రశ్నించారు. మా నినాదం మూడు పంటలు.. కాంగ్రెస్ నినాదం మూడు గంటలు...గతంలో కాంగ్రెస్ రైతులను రాచిరంపాలు పెట్టారు ఈవిషయం అందరికి తెలుసు అన్నారు. దుర్మార్గులైన సన్నసుల మాటలు విందామా 24 గంటలు కరెంట్ ఇస్తున్న కేసిఆర్ మాట విందామా అని మంత్రి కేటీఆర్ అన్నారు. 2004 వరకు టీడీపీ..ఆ తర్వాత 2014 వరకు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది కరెంట్ స్థితి అన్నారు. పక్క రాష్ట్రాల రైతులు మన కరెంట్ వ్యవస్థ గురించి గొప్పలు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.