IT Raids: బంగారం షాపు లపై ఐటీ అధికారుల కొరడా!

కడప నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బూశెట్టి జ్యూవెలర్స్ నుంచి సుమారు 200 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బూశెట్టి షాపుతో లావాదేవీలు ఉన్నందున ఐటీ దాడులు తప్పించుకునేందుకు దుకాణాలను వ్యాపారస్తులు మూసి వేశారు .

IT Raids: బంగారం షాపు లపై ఐటీ అధికారుల కొరడా!
New Update

కడపలోని బంగారు దుకాణాల పై ఐటీ అధికారులు ఫోకస్‌ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో భారీగా బంగారం సీజ్ చేసినట్లు సమాచారం. నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. రెండు రోజు నుంచి ఈ దాడులు జరుగుతుండడంతో 1000 బంగారు దుకాణాలను మూసివేసిన దుకాణాదారులు.

మీడియాని అనుమతించకుండా ఐటీ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు. దాడులు జరుగుతున్న నేపథ్యంలో షాపుల వద్ద కేంద్ర పోలీసులు భారీగా మోహరింపు. బూశెట్టి జ్యూవెలర్స్ నుంచి సుమారు 200 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బూశెట్టి షాపుతో లావాదేవీలు ఉన్నందున ఐటీ దాడులు తప్పించుకునేందుకు దుకాణాలు మూసి వేసిన వ్యాపారస్తులు. నాలుగు దుకాణాల్లో ఇంకా కొనసాగుతున్న తనిఖీలు.

బంగారం షాపుల యజమానుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఐటీ అధికారులు. దీంతో బంగారం షాపు యజమానులు వ్యాపారాలు మానుకొని మరీ దుకాణాలు మూసి వేసుకుంటున్నారు.

కేవలం కడపలోనే కాకుండా తమిళనాడులోని తిరుచ్చి ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 1.90 కిలోల బంగారం, 22 కిలోల వెండితో పాటు రూ. 1.48 లక్షల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, తంజావూరు, నాగ్‌కోయిల్‌లో ‘ప్రణవ్ జ్యువెలరీ’ జ్యువెలరీ దుకాణం తిరుచ్చి ప్రధాన కార్యాలయంతో నడుస్తోంది.

చోండా తిరుచ్చి మదన్, అతని భార్య కార్తీక ఇద్దరూ డైరెక్టర్లుగా షాపులను నిర్వహిస్తున్నారు. ఈ దుకాణంలో డబ్బు, నగలు పెట్టుబడిగా పెట్టి ఖాతాదారులను మోసం చేశారనే ఫిర్యాదు వచ్చింది. తిరుచ్చి, మదురై, చెన్నై ఆర్థిక నేరాల విభాగం పోలీసులకు మొత్తం 635 కేసులు నమోదయ్యాయి, ఆర్థిక నేరాల విభాగం చర్యలు తీసుకోవాలని ఐజీ సత్యప్రియ ఆదేశించారు.

దీని ప్రకారం తిరుచ్చిలోని నగల దుకాణం నిర్వాహకుడు నారాయణన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే తిరుచ్చి, చెన్నైలోని 8 దుకాణాలు, 3 ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల పోలీసులు గురువారం దాడులు చేశారు. ఇందులో 1.90 కిలోల బంగారం, 22 కిలోల వెండి ఆభరణాలు, రూ.1,48,711 నగదు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక నేరాల పోలీసులు శుక్రవారం తెలిపారు.

అలాగే యజమాని మదన్, అతని భార్య కార్తీక, మేలాల్ నారాయణన్‌లకు సుమారు రూ. 14 కోట్ల మేర మోసం చేసినట్లు తిరుచ్చి ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అరెస్ట్‌ అయిన మేలాలాల్ నారాయణన్‌ను మధురైలోని స్పెషల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కోర్టులో హాజరుపరిచి జైలులో ఉంచారు.

Also read: ”బెంగళూరులో మాత్రమే ఇలా”..ట్రాఫిక్‌ లో వర్క్‌ చేస్తున్న యువతి!

#andhrapradesh #it-raids #kadapa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి