దున్నేవాడికే భూమి అన్న బీజేపీ, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటమే..! కలకలం రేపుతోన్న మావోయిస్ట్ కరపత్రాలు!!

తెలంగాణలో మావోయిస్టుల కరపత్రాల కలకలం.. దున్నేవాడికే భూమి అనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ కరపత్రాల్లో పేర్కొన్న అన్నలు.. భద్రాద్రి జిల్లా చర్లలో వెలసిన కరపత్రాలు.. అలర్ట్ అయిన పోలీసులు..

New Update
దున్నేవాడికే భూమి అన్న బీజేపీ, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటమే..! కలకలం రేపుతోన్న మావోయిస్ట్ కరపత్రాలు!!

మరోసారి తెలంగాణలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. దున్నేవాడికే భూమి అనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ కరపత్రాల్లో మావోయిస్ట్ అన్నలు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా చర్లలో ఈ కరపత్రాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.

ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా ఫైట్ చేయాలని మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో ఈ కరపత్రాలున్నాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కాగా, స్థానికంగా ఉండే బీఆర్ఎస్, బీజేపీ నేతల్లో దీంతో గుబులు మొదలైంది.

అయితే ముందు నుంచి ధరణి పోర్టల్ కు వ్యతిరేకంగా ఉన్న మావోయిస్టులు అప్పుడప్పుడు కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేసి అధికార పక్షంలో ఆందోళనను కల్గిస్తున్నారు. అదే విధంగా వరంగల్ లో భూ కబ్జాలకు సంబంధించి కూడా కొన్ని రోజుల క్రితం అన్నలు పోస్టర్లను విడుదల చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Advertisment
తాజా కథనాలు