కుక్కలను కూడా వదలడంలేదు. వాటిపై ఏం పగ ఉందో తెలియదు.. కాల్చి కాల్చి చంపుతున్నారు. విశ్వాసంగా మూగజీవాలు కదా.. అందుకే ఈ క్రూరత్వం.. అవునులే.. చిన్నారులనే వదిలపెట్టని మూర్ఖులు కుక్కలపై జాలీ చూపిస్తారా? పరిగెత్తుకోని వస్తున్న కుక్కను కాల్చి చంపకుండా ఉంటారా? చేతిలో గన్ ఉంటే ఇంకేం ఆగుతారు.. బలహీనులపై ప్రతాపం చూపడం బలవంతుల లక్షణం కదా.. ఇజ్రాయెల్(Israel)- పాలస్తీనా(palestine) మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్ తీవ్రవాదుల చేస్తున్న దారుణాలను కొన్ని మీడియా సంస్థలు బయటపెడుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ అఫిషియల్ సోషల్‌మీడియా హ్యాండిల్స్ హమాస్(Hamas) రాక్షసత్వాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ అకౌంట్ నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా హింసతో కూడిన వీడియో. అందుకే డిస్‌క్లేయిమర్ కూడా వేశారు.
WARNING CONTENT
ఇంటిని తగలపెట్టారు:
తాజాగా విడుదల చేసిన వీడియోలో హమాస్ తీవ్రవాదులు ఓ ఇంటి వద్దకు చేరుకున్నారు. వెంటనే ఆ ఇంటిలోని ఓ కుక్క వారి వైపుగా పరిగెత్తుకుంటూ వస్తోంది. అది చూసిన హమాస్ మిలిటెంట్‌గన్‌తో ఓసారి కాల్చాడు. కుక్కకు బుల్లెట్ తగిలినా అది మాత్రం అతనివైపు దూసుకురావడం ఆగలేదు. దీంతో వెంటనే తుపాకీతో మరోసారి కాల్చాడు. కుక్క చనిపోయిందని నిర్ధారించుకున్నక కాల్చడం ఆపేశాడు. ఇక అక్కడ నుంచి ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చాడు. లైటర్ ఆన్ చేసి ఇంటిని మొత్తం తగలపెట్టాడు. అసలు తాను చేస్తున్నది పెద్ద హింసనన్న విషయం కూడా అతనికి అర్థంకాలేదు. చాలా సాధారణంగా ఇంటిని తగలపెట్టి, కుక్కను చంపేసి వెళ్లిపోయాడు.
యుద్ధంలో హమాస్ తీవ్రవాదుల పైశాచికత్వంపై అనేక కథనాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. చిన్నారల తలలను చంపడం, ఆడవాళ్లను అత్యాచారం చేసి తగలపెట్టడం, కిడ్నాప్ చేయడం, దొరికిన వారిని దొరికినట్టు నిర్ధాక్షిణంగా మర్డర్ చేయడం.. ఇలా ఒకటేమిటి.. ప్రతీ న్యూస్, వైరల్ అవుతున్న వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటున్నాయి. అయితే ఇదంతా ఓ వెర్షన్ వీడియోలు మాత్రమేనని.. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇలాంటి దురాగతాలకు పాల్పడుతుందని పాలస్తీనా వైపు నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. పాశ్చాత్య మీడియా కేవలం హమాస్ చేసినవి మాత్రమే చూపిస్తున్నాయని.. ఇజ్రాయెల్ సైన్యం చేసే వాటిని చూపించడంలేదని ఆరోపిస్తున్నాయి. ఇందులో చాలా వరకు వాస్తవమే ఉందని విశ్లేషకులు చెబుతున్నా.. అసలు సాటి మనిషి మరో మనిషి చంపడం మానవత్వం కాదని హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు బాధపడుతున్నారు. యుద్ధంలో బలైపోయేది అమాయకులేనని చరిత్రను గుర్తు చేస్తున్నారు.
ALSO READ: 40 మంది చిన్నపిల్లల తలలను నరికేశారు… ఇది యుద్ధం కాదు మారణహోమం…!