Sadhguru Health : ఇషా ఫౌండేషన్(Isha Foundation) వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్(Jaggi Vasudev) ఇటీవల బ్రెయిన్ సర్జరీ(Brain Surgery) చేయించుకున్న విషయం తెలిసిందే. రక్తస్రావం, మెదడులో వాపు కారణంగా సద్గురు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మెదడులో పేరుకుపోయిన రక్తాన్ని బయటకు తీయడానికి మార్చి 17న శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం జగ్గీ వాసుదేవ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయన హెల్త్ అప్డేట్(Health Update) ను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. ఇప్పుడు హాస్పిటల్ రూమ్ లోపలి నుంచి ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్(X) లో షేర్ చేశారు జగ్గీ వాసుదేవ్.
పేపర్ చదువుతున్న వీడియో రిలీజ్:
బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న జగ్గీ వాసుదేవ్ తన ఆరోగ్యం గురించి తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి నుంచి 19 సెకన్ల వీడియోను సద్గురు విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఆసుపత్రి బెడ్‌పై కూర్చొని న్యూస్‌పేపర్ చదువుతున్నారు. 19 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో మ్యూజిక్ ప్లే అవుతోంది.
అసలేమైంది?
మార్చి 8న మహా శివరాత్రి వేడుకలు కూడా జరగగా.. మార్చి 15 నాటికి జగ్గీ వాసుదేవ్ ఆరోగ్యం క్షీణించింది. వైద్యుల బృందం ఎంఆర్ఐ చేసింది. మెదడులో వాపు పెరిగిందని, భారీగా రక్తస్రావం జరిగిందని రిపోర్ట్‌లో తేలింది.
సబ్డ్యూరల్ హెమటోమా కలిగించే సమస్యలు:
సబ్డ్యూరల్ హెమటోమా అనేది పుర్రె క్రింద మెదడు ఉపరితలంపై రక్తం పేరుకుపోయే సమస్య. ఈ రకమైన రక్తస్రావం సాధారణంగా తలకు గాయం అయిన తర్వాత సంభవిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా, దీర్ఘకాలికంగా కూడా ఉంటుంది. పుర్రె , మెదడు ఉపరితలం మధ్య నరాల చీలిక వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. మెదడు ఉపరితలంపై రక్తం గడ్డకట్టే పరిస్థితి కూడా అనేక రకాల తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. సబ్డ్యూరల్ హెమటోమాస్ సమస్య ప్రాణాంతకం. అత్యవసర వైద్య సహాయం అవసరం.
Also Read : ఈ మహిళా అభ్యర్థులు మెషీన్ గన్‌లు.. లోక్‌సభ ఎన్నికల్లో పేలుతారా?