AP DGP Harish Kumar Gupta: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో నెలకొంటున్న శాంతి భద్రతల సమస్యలు.. అధికార పార్టీ వైసీపీకి సానుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ చర్యలు తీసుకుంటుంది.
Also Read: మాజీ ఐఏఎస్ పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి..!
ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌ను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా IPS అధికారి హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. హరీష్ కుమార్ గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్. హోం శాఖ కార్యదర్శిగా ఉన్న ఈయన.. ఈసీ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించారు.
This browser does not support the video element.
ఇదిలా ఉండగా.. ఏపీలో అధికారులపై వరుసగా బదిలీ వేటు పడడం కలకలం రేపుతోంది. ఎన్నికలు ముగిసే వరకు మరికొంత మంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఈసీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.