Pete Hegseth : అమెరికా రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న పీట్ హెగ్సేత్‌పై అతని తల్లి పెనెలోప్ హెగ్సేత్ సంచలన ఆరోపణలు చేసింది. పీట్ కు మహిళలపై చాలా చులకన భావం ఉంటుందని, తన కుమారుడి ప్రవర్తన తనకే నచ్చదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ మేరకు ఇటీవలే పీట్ హెగ్సేత్ ను రక్షణశాఖ మంత్రిగా ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా అతను ఈ పదవికి అనర్హుడంటూ పరోక్షంగా విమర్శలు చేసింది.
ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?
నేను అతన్ని గౌరవించను..
పీట్ మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు. అతనికి మహిళలంటే చాలా చిన్న చూపు. మహిళలతో అమర్యాదగా ప్రవర్తిస్తాడు. స్వలాభం కోసం స్త్రీలను చులకనగా చూస్తాడు. వారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతాడు. అందుకే నేను అతన్ని గౌరవించను. ఒక తల్లిగా కొడుకు క్యారెక్టర్ గురించి మౌనంగా ఉండాలని ప్రయత్నించాను. కానీ పీట్ హెగ్సేత్ రెండో భార్య సమంత అనుభవించిన బాధ గురించి తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయా. అందుకే ఒక మహిళగా నిజమే మాట్లాడుతున్నా అంటూ మెయిల్ రూపంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: Ind vs Aus: అతడొక ప్యాకేజీలాంటి బౌలర్.. బుమ్రాను టార్గెట్ చేసిన స్మిత్
ఇక తన కోడలు సమంత మంచి వ్యక్తిత్వం కలిగిన మహిళ అని చెప్పింది. పిల్లల పెంపకంలో ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని, అలాంటి స్త్రీతో పీట్ అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. నీ ప్రవర్తనతో మేమంతా విసిగిపోయాం. అయినా ఒక తల్లిగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని పేర్కొంది. సమంతను రెండో వివాహం చేసుకున్న పీట్.. ముగ్గురు పిల్లలను కన్నాడు. ఆ తర్వాత సహోద్యోగితో మరో చిన్నారికి జన్మనిచ్చినట్లు బయటపడటంతో సమంత విడాకులు కోరింది.
ఇది కూడా చదవండి: China: కండోమ్‌ల పేరుతో.. 63 హోటళ్లను మోసం చేసిన యువకుడు..
ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే