పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. సెంట్రల్ గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ కూడా ధ్వంసమయ్యింది. ఇప్పటికే హమాస్‌కు చెందిన పలువురు కీలక నేతలను ఇజ్రయెల్ మట్టుబెట్టింది. అయితే తాజాగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ కూడా మృతి చెందినట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. అతడు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైనిక దళాలు కూడా భావిస్తున్నాయి. యాహ్యా సిన్వార్ సజీవంగా ఉండకపోవచ్చని చెబుతున్నాయి. ఇటీవలే హమాస్ సొరంగాలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
Also Read: ప్రమాదంలో దామగుండం అడవి.. త్వరలో 12 లక్షల చెట్లు విధ్వంసం !
మరోవైపు హిజ్బుల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. భారీ శబ్దాలతో లెబనాన్ దద్దరిల్లుతోంది. ఇటీవల పేజర్లు, వాకీటాకీలు పేలిన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమయం చూసి ఇజ్రాయెలే వీటిని పేల్చేసిందని లెబనాన్ వర్గాలు ఆరోపించాయి. అంతేకాదు ఇటీవల ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై కూడా ఆ దేశ ఎంపీ అహ్మద్ అర్దెస్తాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ హెలికాప్టర్ ప్రమాద ఘటనను పేజర్ల పేలుళ్లతో ముడిపెడుతూ కామెంట్స్ చేశారు. రైసీ కూడా పేజర్ వినియోగించేవారని.. ఆయన మృతి వెనుక ఇజ్రాయెల్ కారణముందనే అనుమానాలు వ్యక్తం చేశాడు.